గురువారం, 26 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : బుధవారం, 5 ఆగస్టు 2020 (09:19 IST)

సింగర్‌ స్మితకు కరోనా

ప్రముఖ సింగర్‌ స్మితకు, ఆమె భర్తకు కరోనా పాజిటివ్‌ నిర్ధారణ అయింది. ఈ మేరకు స్వయంగా ఆమే తన ట్విట్టర్‌ ద్వారా తెలిపారు.

తీవ్రమైన ఒళ్లు నొప్పులతో బాధపడినట్లు తెలిపారు. అనుమానం వచ్చి కరోనా టెస్ట్‌ చేయించుకున్నామన్నారు. తనకు, భర్త శశాంక్‌కు కరోనా పాజిటివ్‌గా నిర్థారణైందన్నారు. త్వరలోనే కరోనాని జయించి ప్లాస్మా దానం చేయడానికి సిద్ధంగా ఉన్నట్లుగా ఆమె ప్రకటించారు. 

ఇప్పటికే పలువురు సినీ ప్రముఖులు, వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు సైతం కరోనా బారిన పడిన విషయం తెలిసిందే.