శుక్రవారం, 24 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By జె
Last Modified: మంగళవారం, 29 అక్టోబరు 2019 (20:16 IST)

ఎపి సిఎంపై సంచలన వ్యాఖ్యలు చేసిన దగ్గుబాటి, ఏమైంది?

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో దగ్గుబాటి వేంకటేశ్వరరావు ఉంటూ వచ్చారు. ఆయన భార్య దగ్గుబాటి పురంధేశ్వరి బిజెపిలో ఉండడం, ఈయన వైసిపిలో ఉండడం రాజకీయాల్లో పెద్ద చర్చకే దారితీసింది. అయితే పురంధేశ్వరి బిజెపిలో ఉండడం వైసిపి నేతలకు ఏమాత్రం ఇష్టం లేదు. అందులోను సీఎం జగన్‌కు అస్సలు ఇష్టం లేదనే వాదన వుంది.
 
అందుకే దగ్గుబాటి వేంకటేశ్వరరావు వైసిపిలో పెద్దగా ఇమడలేకపోయారు. చివరకు పార్టీ నేతల నుంచి ఒత్తిడి రావడంతో ఆ పార్టీని వదిలివెళ్ళిపోవాలని నిర్ణయించుకున్నారు. నాకు నేనుగా పార్టీలోకి వచ్చా.. నన్ను ఎవరూ పంపించలేరు.. నాకు నేనుగా వెళ్ళిపోతానంటూ ఎపి సిఎం జగన్మోహన్ రెడ్డిని ఉద్దేశించి వ్యాఖ్యలు చేశారు దగ్గుబాటి వేంకటేశ్వరావు. దగ్గుబాటి వ్యాఖ్యలు కాస్త రాజకీయంగా పెను ప్రకంపనలే రేపుతున్నాయి.