శుక్రవారం, 10 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By జె
Last Modified: మంగళవారం, 29 అక్టోబరు 2019 (16:47 IST)

నేను ఏ అమ్మాయిని పెళ్లాడుతానో తెలుసా? సుడిగాలి సుధీర్

సుధీర్ అంటే పెద్దగా తెలియదు గానీ సుడిగాలి సుధీర్ అంటే మాత్రం ఠక్కున గుర్తుపట్టేస్తారు తెలుగు ప్రజలు. బుల్లితెరపై సుధీర్ చేసిన స్కిట్లు అలాంటివి. యాంకర్‌గా, కమెడియన్‌గా సుధీర్‌కు మంచి గుర్తింపే ఉంది. సుధీర్‌కు ఎంతోమంది అమ్మాయిలతో ఎఫైర్లు కూడా కలిపారు. త్వరలోనే పెళ్ళి కూడా చేసుకుంటారని ప్రచారం కూడా చేశారు.
 
అయితే దీనికంతటికీ సమాధానం చెప్పేశారు సుడిగాలి సుధీర్. నా తమ్ముడు ప్రేమ వివాహం చేసుకున్నాడు. ఇప్పుడు అందరూ నా పెళ్ళి మీదే పడ్డారు. నా గురించి కొంతమంది దుష్ప్రచారం చేస్తున్నారు. నేను ఆమెను పెళ్ళి చేసుకుంటా.. ఈమెను పెళ్ళి చేసుకుంటానంటూ ఎఫైర్లు అంటగట్టేస్తున్నారు. 
 
నేను ఒక్కటే చెప్పదలుచుకున్నా. నేను మెచ్యూరిటీ వ్యక్తిని. కొంతమంది ప్రవర్తించే విధంగా నేను ప్రవర్తించను. నా దారి రహదారి. త్వరలోనే నా పెళ్ళి. నా తల్లిదండ్రులు చెప్పే వారినే నేను పెళ్ళి చేసుకుంటానంటున్నాడు సుడిగాలి సుధీర్.