బుధవారం, 29 మార్చి 2023
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated: శుక్రవారం, 30 డిశెంబరు 2022 (17:14 IST)

విశాఖను మాకిస్తే ఓ చిన్న రాష్ట్రం ఏర్పాటు చేసుకుంటాం : మంత్రి ధర్మాన

dharmana prasada rao
విశాఖపట్టణాన్ని తమకు ఇచ్చేస్తే విశాఖను రాజధానిగా చేసుకుని ఓ చిన్నరాష్ట్రాన్ని ఏర్పాటు చేసుకుంటామని ఏపీ మంత్రి ఏపీ మంత్రి ధర్మాన ప్రసాద రావు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఉత్తరాంధ్రలో పర్యటిస్తున్న టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు నవ్యాంధ్రకు అమరావతే ఏకైక రాజధాని అంటూ ప్రచారం చేస్తున్నారని గుర్తు చేశారు. 
 
చంద్రబాబు వ్యాఖ్యలు మన చేతులతో మన కళ్లను పొడిచే ప్రయత్నమే అని విమర్శించారు. అలాంటపుడు మాకు విశాఖను ఇచ్చేస్తే విశాఖ రాజధానిగా ఓ చిన్న రాష్ట్రం ఏర్పాటు చేసుకుంటామని ఆయన అన్నారు. 
 
శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల మండలం బొంతలకోడూరులో మంత్రి ధర్మాన ప్రసాద రావు పాల్గొని ప్రసంగిస్తూ, చంద్రబాబుపై తీవ్ర విమర్శలు గుప్పించారు. చంద్రబాబుకు అధికారమే పరమావధి అని అన్నారు. ప్రజల్లో ఏ మూలో సైకిల్ భావన ఉందని, సైకిల్‌ను నమ్మి మోసపోవద్దన్నారు 
 
వైకాపా ప్రభుత్వ వాయంలో జరుగుతున్న ప్రజా సంక్షేమాన్ని, అభివృద్ధిని చూడలేకే చంద్రబాబు బాదుడే బాదుడు పేరుతో ఓ కార్యక్రమం తలపెట్టి రాష్ట్రంలో పర్యటిస్తున్నారని ఆరోపించారు. ఆయనకు ప్రజలే తగిన గుణపాఠం చెప్పాలన్నారు.