మంగళవారం, 6 జనవరి 2026
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 29 డిశెంబరు 2025 (16:38 IST)

అవును... నేను లావుగా ఉన్నాను : అమీర్ ఖాన్ కుమార్తె

ira khan
అవును.. నేను లావుగా ఉన్నాను. 2020 నుంచి లావుగా ఉన్నాననే భావనతో అధిక బరువు, ఒబేసిటీ మధ్య ఊగిసలాడుతున్నాను. నా శరీరం గురించి నేను ఇంకా తెలుసుకోవాల్సిన విషయాలు చాలా ఉన్నాయి. అయితే, నాలో ఒక చిన్న సానుకూల మార్పు కనిపించడంతో దీని గురించి మాట్లాడటం మొదలుపెట్టాలని నిర్ణయించుకున్నా అని ఇరాఖాన్ తన పోస్ట్‌లో రాసుకొచ్చారు. 
 
గతంలో తాను ఎదుర్కొన్న డిప్రెషన్ గురించి మాట్లాడినంత ధైర్యంగా, స్పష్టంగా దీని గురించి మాట్లాడలేకపోవచ్చని, ఎందుకంటే ఇది తనకు కొంచెం భయంగా అనిపిస్తోందని వివరించారు. ఇరా ఖాన్ గతంలో తాను డిప్రెషన్‌లో సుధీర్ఘకాలం పోరాడిన విషయాన్ని కూడా బహిరంగంగా వెల్లడించిన సంగతి తెలిసిందే. ఇపుడు బామీ ఇమేజ్ సమస్యలపై ఆమె మాట్లాడటం ప్రాధాన్యత సంతరించుకుంది.