శనివారం, 28 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం

అమరావతిని ముక్కలు చేయ్యద్దు

రాజకీయ కుట్ర, స్వార్ధంతో అమరావతిని మారుస్తామంటే రాష్ట్రం ఆర్ధికంగా వెనుకబడి భవిష్యత్తు తరాలకు భవిష్యత్తు లేకుండా పోతుందని పలువురు మహిళా జేఏసి నేతలు అన్నారు. అమరావతి పరిరక్షణ సమితి జెఏసీ ఆధ్వర్యంలో ఆదివారం విజయవాడలో అమరావతి పరిరక్షణ సమితి మహిళా జెఏసీ ఆధ్వర్యంలో రాజధాని అమరావతిగానే కొనసాగాలని కోరుతూ చేపట్టిన ఉద్యమం 299 వ రోజుకు చేరుకున్న నేపధ్యంలో “అమరావతి వాక్” ( ర్యాలీ ) నిర్వహించారు.

బి.ఆర్.టి.ఎస్ రోడ్డులోని శారదా కళాశాల నుండి ప్రారంభమైన ర్యాలీ పడవల రేవు వరకు సాగింది. "సాదిస్తాం..సాదిస్తాం .. అమరావతి సాధిస్తాం”, “ప్రజల రాజధాని అమరావతి”, “స్వార్ధం కోసం రాజధానిని ముక్కలు చేయద్దు”, “ఒకే రాష్ట్రం ఒకే రాజధాని" అంటూ పెద్దపెట్టున నినాధాలుచేస్తూ ప్లకార్డు చేతపట్టుకొని ర్యాలీ సాగింది.

ఈ సందర్భంగా అక్కినేని వనజ మాట్లాడుతూ అమరావతి స్మశానం కాదని ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి పునాదని రాజధాని తరలింపు రాజకీయ కుట్రగా అభివర్ణించారు. రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వం వంతపాడటం దుశ్చర్యగా పేర్కొన్నారు.

రెండున్నర సంవత్సరాలు రాజధాని అమరావతి నుండే పాలన సాగిందన్నారు. పదివేల కోట్ల రూపాయలతో అనేక రకాల పరిపాలన భవనాలను నిర్మంచారని ఇంకా కొద్దిపాటి మొత్తంతో పూర్తిస్థాయి పరిపాలన భవనాలు రూపొందుతాయన్నారు. రాష్ట్ర అభివృద్ధి రాజధానితోనే సాధ్యమని ఆంధ్రప్రదేశ్ ను అమరావతిని ఏకైక రాజధనిగా ప్రకటించేవరకు తమ పోరాటం సాగుతుందని స్పష్టంచేశారు.
 
కాంగ్రెస్ నాయకురాలు సుంకర పద్మశ్రీ మాట్లాడుతూ రాష్ట్రాన్ని, ప్రజలను ఈరోజు న్యాయ వ్యవస్థ కాపాడుతోందని, రైతుల త్యాగంతో ఏర్పడిన రాజధానిని కూల్చడం జగన్ రెడ్డి తరం కాదన్నారు. అధికారాన్ని అడ్డు పెట్టుకొని పోలీసులతో ఉద్యమాన్ని అణిచివేయలేరని, ఉద్యమాన్ని అణిచివేసేందుకు మాపై కేసులు పెట్టిన అరెస్టులు చేసిన ఉద్యమాన్ని ఆపలేరన్నారు.

ఉద్యమాన్ని అణిచివేసేందుకు అరెస్టులు చేసి భయపెడితే జైల్ భరోసాను చేపడతామని హెచ్చరించారు. అమరావతి పూర్తయితే రాష్ట్రంలోని యువతకు ఉద్యోగ అవకాశాలు లభిస్తామన్నారు. ప్రభుత్వ వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకే 3 రాజధానుల “జగన్నాటకం" అన్నారు. కార్యక్రమంలో అమరావతి పరిరక్షణ సమితి జెఏసీ రాష్ట్ర కన్వీనర్ ఎ.శివారెడ్డి, తెదెపా నాయకురాలు గద్దె అనూరాధ, దుర్గా భవానీ, సి.హెచ్ బాబురావు తదితరులు పాల్గొన్నారు. 
 
నేడు గాంధీనగర్ తాలూకా ఆఫీసు వద్ద “నిరసన దీక్ష"
అమరావతి రాజధాని ఉద్యమం 300 రోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా నేడు గాంధీనగర్, తాలూకా ఆఫీసు వద్ద అమరావతి పరిరక్షణ మహిళా జెఏసి ఆధ్వర్యంలో నిరసన చేపట్టునున్నట్లు తెలిపారు.నిరననలో జెఏనీ మహిళాలు, తెదేపా, కాంగ్రెస్, జనసేన, ఆమాద్మీ, సిపిఐ, సిపిఎమ్ పార్టీలు, వాణిజ్య, వర్తక సంఘాల నాయకులు, రాజధాని రైతులు పాల్గొంటారని తెలిపారు.