ఆదివారం, 26 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By
Last Updated : ఆదివారం, 22 సెప్టెంబరు 2019 (17:28 IST)

జగన్ పెళ్లికి శివప్రసాద్ ఏం చేశారో తెలుసా?

టీడీపీ మాజీ ఎంపీ డాక్టర్‌ నారుమల్లి శివప్రసాద్‌ అనారోగ్యంతో శనివారం నాడు కన్నుమూసిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా ఆయనకు సంబంధించిన పలు ఆసక్తికర విషయాలు వెలుగు చూస్తున్నాయి.

శివప్రసాద్‌కు ఒక్క టీడీపీతోనే కాదు అన్ని పార్టీలతోనూ.. ముఖ్యనేతలతో మంచి సాన్నిహిత్యం ఉంది. ‘ప్రేమతపస్సు’ సినిమా దర్శకత్వం వహిస్తున్నప్పుడు టీడీపీ నుంచి తిరుపతి ఎంపీ టికెట్టు ఆఫర్‌ వచ్చినా.. అప్పట్లో ఆయనకు సినిమాల మీద ఉన్న ఆసక్తితో రాజకీయాల్లోకి వెళ్లలేదు.

వైఎస్‌ రాజారెడ్డితో ఉన్న పరిచయంతో వైఎస్‌ రాజశేఖర రెడ్డి ఆయనకు కాంగ్రెస్‌ తరఫున 1996లో తిరుపతి ఎంపీ టికెట్టును ఆఫర్‌ చేశారు. నేదురుమల్లి జనార్దన రెడ్డి అడ్డుపడడంతో టికెట్టు దక్కలేదు.

ప్రస్తుత ముఖ్యమంత్రి జగన్‌ పెళ్లికి తిరుపతి నుంచి ఈయన, ప్రస్తుత ఎమ్మెల్యే కరుణాకరరెడ్డి వంద వాహనాల్లో జనాలను పిలుచుకుని వెళ్లారు.