బుధవారం, 1 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : శనివారం, 27 ఫిబ్రవరి 2021 (09:50 IST)

గాడిదల అక్రమ రవాణా..ఎక్కడ?

గుంటూరు జిల్లాలో గాడిదల అక్రమంగా రవాణాను పోలీసులు అడ్డుకున్నారు. గాడిదల అక్రమ రవాణాపై పక్కా సమాచారం అందకున్న పోలీసులు దాచేపల్లి వద్ద కాపు కాసి వాటిని పట్టుకున్నారు. 

రాజస్థాన్ నుంచి చెరుకుపల్లి వయా హైదరాబాద్‌కు లారీలో తరలిస్తున్న 39 గాడిదలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అనంతరం గాడిదలను పునరావాస కేంద్రానికి తరలించారు.

అంతరించిపోతున్న గాడిదలను తరలించడం, మాంసం తినడం చట్టరీత్యా నేరమని, గాడిదల అక్రమ రవాణా విషయమై తగు సమాచారం అందిస్తే బాధ్యులపై చట్ట పరంగా చర్యలు తీసుకుంటామని గురజాల రూరల్ సీఐ ఉమేష్ స్పష్టం చేశారు.