నా భర్తే నన్ను ప్రశ్నించలేదు, నువ్వెవడిరా నన్నడగటానికి? ప్రియుడితో వాగ్వాదం
ఇద్దరు బిడ్డల తల్లి. భర్తతో గొడవపడింది. ప్రియుడితో పారిపోయింది. ప్రియుడితో సహజీవనం చేస్తూ మరొక యువకుడికి దగ్గరైంది. నాతో వచ్చిన నువ్వు వేరొకరితో ఎలా కలుస్తావంటూ ప్రశ్నించాడు ప్రియుడు. నువ్వెవరు అంటూ ఆగ్రహంతో ఊగిపోయింది. దీంతో చంపి వెళ్ళిపోయాడు ప్రియుడు.
నెల్లూరు జిల్లా దొరవారిసత్రం మండలం పోతిరెడ్డిపాళేనికి చెందిన మణికి మొదటి భార్య మరణించడంతో లత అనే యువతిని పెళ్ళాడాడు. ఆమెకు ఇద్దరు పిల్లలు పుట్టారు. స్థానికంగా ఇద్దరూ అపాజీ పరిశ్రమలో పనిచేసేవారు.
అయితే అక్కడే తనతో పాటు పనిచేసే నాగరాజుతో లతకు పరిచయమైంది. ఆ పరిచయం కాస్త వివాహేతర సంబంధానికి దారితీసింది. భర్త విషయం తెలిసి మందలించాడు. అయినా ఆమెలో మార్పు రాలేదు. భర్త వద్దని ప్రియుడితో వెళ్ళిపోయింది.
ఇద్దరూ కలిసి కావలిలో వేరు కాపురం పెట్టారు. సహజీవనం చేశారు. 15 రోజులుగా ఈ తతంగం సాగింది. అయితే గత నాలుగు రోజుల నుంచి లత ఎవరితోను గంటల గంటలు ఫోన్ మాట్లాడుతుండటం నాగరాజు గమనించాడు. అనుమానం పెంచుకున్నాడు.
ఎవరో యువకుడితో లత మాట్లాడుతోందని నిర్థారించుకున్నాడు. దీంతో ఆమెను ప్రశ్నించాడు. పెళ్ళి చేసుకున్న భర్తే నన్ను ప్రశ్నించలేదు.. నువ్వెవరు అంటూ ప్రశ్నించింది లత. దీంతో ఆగ్రహంతో ఊగిపోయిన నాగరాజు ఆమెను గట్టిగా తలపై కొట్టాడు. స్పృహ తప్పి పడిపోయిన లతను ఫ్యాన్‌కు ఉరి వేసేశాడు. ఆత్మహత్య చేసుకుందని స్థానికులను నమ్మించే ప్రయత్నం చేశాడు.
పోలీసులు ఘటనా స్థలికి వచ్చి చూసి అనుమానంతో నాగరాజును అదుపులోకి తీసుకుంటే అసలు విషయాన్ని బయటపెట్టాడు. అక్రమ సంబంధం చివరకు లత ప్రాణాలను తీసింది.