ఆదివారం, 5 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : మంగళవారం, 2 మార్చి 2021 (10:36 IST)

12 నుంచి డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ యూనివర్సిటీ డిగ్రీ పరీక్షలు

డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ యూనివర్సిటీ పరిధిలోని డిగ్రీ విద్యార్థులకు 3, 5 సెమెస్టర్‌ పరీక్షలు ఈ నెల 12వ తేదీ నుంచి నిర్వహించనున్నట్టు డీన్‌ ఆఫ్‌ ఎగ్జామినేషన్స్‌ ప్రొఫెసర్‌ బిడ్డిక అడ్డయ్య తెలిపారు. ఈ నెల 12 నుంచి 24 వరకూ ఉదయం 3వ, మధ్యాహ్నం 5వ సెమెస్టర్‌పరీక్షలు జరుగుతాయని చెప్పారు.

బీఈడీ, బీపీఈడీ పరీక్షలకు సంబంధించి ఈ నెల 10న జరగాల్సిన పరీక్ష పేపరును 15వ తేదీకి వాయిదా వేసినట్టు చెప్పారు. ఈ నెల 10వ తేదీన మున్సిపల్‌ ఎన్నికల పోలింగ్‌ జరగనున్న దృష్ట్యా పరీక్షను వాయిదా వేశామన్నారు.

ఈ విషయాన్ని విద్యార్థులు గమనించాలని సూచించారు. వర్సిటీ పరిధిలో 15 బీఈడీ కళాశాలలకు అఫిలియేషన్‌ ఇచ్చామన్నారు.

వర్సిటీలో పీజీ విద్యార్థులకు 3వ సెమెస్టర్‌ పరీక్షలు జరుగుతున్నాయని... ఒకటో సెమిస్టర్‌ విద్యార్థులకు ఆన్‌లైన్‌లో తరగతులు నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు.