శనివారం, 28 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సెల్వి
Last Updated : బుధవారం, 30 మార్చి 2022 (14:11 IST)

ఏపీ ప్రజలకు విద్యుత్ ఛార్జీల మోత

ఏపీ ప్రజలకు విద్యుత్ ఛార్జీల మోత తప్పేలా లేదు. తెలంగాణలో ఇప్పటికే విద్యుత్ ఛార్జీలు పెరిగిన తరుణంలో ఏపీలోనూ జగన్ సర్కారు విద్యుత్‌ చార్జీలను పెంచింది.  
 
పెట్రో, గ్యాస్‌ ధరలు పెరిగిన నేపథ్యంలో విద్యుత్‌ ఛార్జీలను పెంచడం జరిగిందని తిరుపతి సెనేట్‌ హాల్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో విద్యుత్‌ రెగ్యులేటరీ చైర్‌మన్‌ జస్టిస్‌ నాగార్జున తెలిపారు. 
 
గృహ వినియోగదారులు సహకరించాలని కోరారు. ఛార్జీల పెంపుదల వల్ల ప్రభుత్వానికి 14 వందల కోట్లు ఆదాయం వస్తుందని ఆయన వెల్లడించారు. 
 
పెరిగిన విద్యుత్ ఛార్జీల వివరాలు
30 యూనిట్ల వరకు యూనిట్‌కు 45 పైసలు, 31 నుంచి 75 యూనిట్ల వరకు యూనిట్‌కు 91 పైసలు పెంచారు. 76 నుంచి 125 యూనిట్ల వరకు యూనిట్‌కు రూ. 1.40 పైసలు పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.
 
126 నుంచి 225 యూనిట్ల వరకు రూ. 6 లు, 226 నుంచి 400 యూనిట్ల వరకు యూనిట్‌కు రూ. 8.75 పైసలు , 400 యూనిట్లకు పైగా ఉన్నవాటికి యూనిట్‌కు రూ. 9.75 పైసలు ప్రభుత్వం ఛార్జీలను పెంచింది.