శుక్రవారం, 8 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : మంగళవారం, 12 మే 2020 (19:48 IST)

ప్రతి ఒక్కరికి పరిహారం అందుతుంది: మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు

ఎల్.జి. పాలిమర్స్ స్టైరీన్ గ్యాస్ లీక్ బాధితులలో ప్రతి ఒక్కరికి పరిహారం అందుతుందని రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు స్పష్టం చేశారు. మంగళవారం కెజిహెచ్ లో చికిత్స పొందుతున్న బాధితులను ఆయన పరామర్శించారు. 

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బాధితుల దరకు  పరిహరం పరిహరం అందుతుందని,  ప్రజల్లో ఆత్మస్థైర్యం నింపేందుకు బాధిత గ్రామాల్లో రాష్ట్ర మంత్రులు, ఎంపిలు  అధికారులు రాత్రి బస చేసినట్లు చెప్పారు.  ఏ సమస్య లేకుండా ప్రభుత్వం చూసుకుంటుందని, ఏ ఒక్కరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. 

గ్రామాల్లో ప్రజల ఆరోగ్యం కోసం ప్రత్యేక విభాగధిపతులచే, పరీక్షలు, వైద్య సేవలు అందించడం జరుగుతుందన్నారు. మంచి నీళ్లు ట్యాంకుల ద్వారా సరఫరా చేయడం జరుగుతుదని చెప్పారు. 

అందరూ సంతోషంగా ఉండాలని, ప్రజల సంక్షేమే ప్రభుత్వానికి ముఖ్యమని  పేర్కొన్నారు.  సోషల్ మీడియాలో వస్తున్న వదంతులను నమ్మవద్దని స్పష్టం చేశారు. 

ఈ కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారి ఎం. శ్రీదేవి, కెజిహెచ్ పర్యవేక్షకులు డా.జి. అర్జున్, డిప్యూటీ సూపరింటెండెంట్ డా. ఇందిరాదేవి తదితరులు పాల్గొన్నారు.