గురువారం, 26 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సెల్వి
Last Updated : సోమవారం, 9 డిశెంబరు 2019 (15:09 IST)

ఫేస్‌బుక్ పుణ్యంతో 15 ఏళ్ల క్రితం తప్పిపోయిన బాలిక..?

ఫేస్‌బుక్ పుణ్యంతో 15 ఏళ్ల క్రితం తప్పిపోయిన ఓ బాలిక తల్లిదండ్రుల వద్దకు చేరుకుంది. అయితే పెంచిన తల్లి మమకారం ఆమెను వేదనలో ముంచెత్తింది. వివరాల్లోకి వెళితే.. భవాని అనే అమ్మాయి నాలుగున్నరేళ్ల వయసున్నప్పుడు తల్లిదండ్రుల నుంచి తప్పిపోయింది. 
 
తండ్రి మాధవరావు, తల్లి వరలక్ష్మి తమ బిడ్డ కోసం ఎక్కడెక్కడో వెతికారు. కానీ ప్రాప్తం లేదనుకుని వదిలేశారు. అయితే భవానిని జయరాణి అనే మహిళ పెంచి పెద్ద చేసింది. చివరకు ఫేస్‌బుక్‌లో పోస్టు భవానీ ఫోటోను పోస్టు చేయడం ద్వారా ఆమెను తల్లిదండ్రులు గుర్తించారు.
 
అలా తల్లిదండ్రుల వద్దకు భవానీ చేరింది. కానీ భవానీని చిన్ననాటి నుంచి అన్నీతానై పెంచిన జయరాణిని వీడివెళ్లాల్సి రావడం భవానీని తీవ్ర భావోద్వేగాలకు గురిచేసింది.