శనివారం, 25 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : గురువారం, 5 డిశెంబరు 2019 (15:19 IST)

నాలుగేళ్ల బాలికపై అత్యాచారం.. ఎయిడ్స్ బారిన బాధితురాలు

దేశంలో మహిళలపై అత్యాచారాలు, అఘాయిత్యాలు పెచ్చరిల్లిపోతున్నాయి. వావి వరుసలు, వయోబేధం లేకుండా మహిళలపై అత్యాచారాలు పెరిగిపోతున్నాయి. తాజాగా ఓ కామాంధుడి కామానికి బలైపోయిన నాలుగేళ్ల చిన్నారి ఎయిడ్స్ బారిన పడింది. రాజస్థాన్‌లో జైపూర్ నగరంలో ఒక కామాంధుడు నాలుగేళ్ల బాలికపై అత్యాచారానికి పాల్పడ్డాడు.
 
ఆ తర్వాత ఆ బాలికకు వైద్య పరిక్షలు చేయగా ఆమెకు హెచ్ఐవి సోకిందని వైద్యులు గుర్తించారు. అతని ద్వారా ఆ బాలికకు ఆ వ్యాధి సోకిందని విచారణలో వెల్లడి అయ్యింది. దీనితో ఆ బాలికకు వైద్యులు చికిత్స చేశారు.
 
ఆ బాలిక బ్రతికి ఉన్నన్ని రోజులు మందులు వాడాలని… అయితే ఆమె ఆరోగ్యానికి వచ్చిన సమస్య ఏమీ లేదని.. రోజు స్కూల్‌కి వెళ్ళొచ్చని పిల్లలతో ఆడుకోవచ్చని వైద్యులు తెలిపారు.