మంగళవారం, 28 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 12 నవంబరు 2024 (17:02 IST)

గర్బగుడి ముందే పిడిగుద్దులు కురిపించుకున్న పూజారులు (వీడియో)

priest fight
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అన్నమయ్య జిల్లా తలకోన సిద్ధేశ్వర స్వామి ఆలయంలో పూజారులు ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు. గర్భగుడిలోనే పిడుగుద్దులు కురిపించుకున్నారు. దీనికి సంబంధించిన వీడియో ఒకటి ఇపుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. విధుల నిర్వహణ విషయమై ఇద్దరు పూజారుల మధ్య మాటామాటా పెరిగింది. ఆవేశం పట్టలేక ఒకరిపై మరొకరు చేయిచేసుకోవడంతో భక్తులు ఇద్దరినీ విడదీశారు. 
 
కార్తీకమాసం సందర్భంగా తలకోన ఆలయానికి భక్తులు పెద్ద సంఖ్యలో వస్తున్నారు. దీంతో గర్భగుడిలో పూజలు చేస్తే సంభావన ఎక్కువగా వస్తుందనే ఉద్దేశంతో ఇద్దరు పూజారులు పోటీ పడ్డారు. ఈ రోజు పూజలు నిర్వహించే బాధ్యతలు తనదంటే తనదని గొడవపడ్డారు. ఈ క్రమంలో మాటామాటా పెరిగి పరస్పరం దాడులు చేసుకున్నారు. ఇంతలో అక్కడున్న భక్తులు వచ్చి పూజారులను విడదీశారు. ఈ నెల 10వ తేదీ ఈ గొడవ జరగగా తాజాగా ఆలయంలోని సీసీటీవీ కెమెరా ఫుటేజీ బయటకు వచ్చింది.