15న అమ‌రావ‌తిలో జెండా వంద‌నం కార్య‌క్ర‌మాలు

independence day celebrations
ఎం| Last Updated: గురువారం, 13 ఆగస్టు 2020 (23:22 IST)
ఈ నెల 15న భారత స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని అమరావతి (వెలగపూడి) రాష్ట్ర శాసన మండలి వద్ద ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసన మండలి అధ్యక్షులు ఎంఎ షరీఫ్ ఆ రోజు ఉదయం 8గంట‌లకు జాతీయ జెండాను ఎగురవేస్తారు.

అలాగే రాష్ట్ర శాసన సభ వద్ద అసెంబ్లీ సభాపతి తమ్మినేని సీతారామ్ ఉ.8.15గం.లకు జాతీయ జెండాను ఎగుర వేస్తారు. సచివాలయం మొదటి భవనం వద్ద రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని ఉద‌యం 7.30 గంట‌లకు జాతీయ జెండాను ఎగురవేస్తారు.

అదేవిధంగా ఆంధ్ర్రప్రదేశ్ రాష్ట్ర ఉన్నత న్యాయస్థానంలో ఉద‌యం 10గంట‌లకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ జితేంద్రకుమార్ మహేశ్వరి జాతీయ జెండాను ఎగురవేయనున్నారు.
దీనిపై మరింత చదవండి :