బుధవారం, 22 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By వరుణ్
Last Updated : ఆదివారం, 29 జనవరి 2023 (10:47 IST)

ఉమ్మడి ఏపీ మాజీ మంత్రి వట్టి వసంతకుమార్ ఇకలేరు...

vatti vasantha kumar
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మంత్రిగా పనిచేసిన వట్టి వసంత కుమార్ కన్నమూశారు. ఆయనకు 70 యేళ్లు. గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతూ వచ్చిన ఆయన విశాఖపట్టణంలోని అపోలో ఆస్పత్రిలో తుదిశ్వాస విడిచినట్టు వైద్యులు వెల్లడించారు. ఆరోగ్యం విషమించడంతో చనిపోయారు. 
 
వెస్ట్ గోదావరిజిల్లాలోని పూళ్ల ఆయన స్వగ్రామం. ఉంగుటూరు నుంచి 2004, 2009 సంవత్సరాల్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా ఆయన పోటీ చేసి గెలుపొందారు. ఆయనకు దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి, మాజీ సీఎం నల్లారి కిరణ్ కుమార్ రెడ్డిల ప్రభుత్వాల్లో వట్టి వసంత కుమార్ మంత్రిగా పని చేశారు. 
 
2014 ఎన్నికల తర్వాత ఆయన క్రియాశీలక రాజకీయాలకు దూరంగా ఉన్నారు. వసంతకుమార్ భౌతిక కాయాన్ని విశాఖ నుంచి స్వగ్రామం తరలించి అక్కడే అంత్యక్రియలు పూర్తి చేయనున్నారు. ఆయన మరణవార్త తెలిసి పలువురు రాజకీయ నాయకులు సంతాపం తెలిపారు.