బుధవారం, 1 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By వరుణ్
Last Updated : బుధవారం, 4 జనవరి 2023 (11:17 IST)

బ్రోంకోప్ న్యుమోనియాతో బెంగాలీ సింగర్ సుమిత్రా సేన్ ఇకలేరు

sumitra sen
ప్రముఖ బెంగాలీ సింగర్ సుమిత్రా సేన్ ఇకలేరు. ఆమె 89 యేళ్ల వయసులో అనారోగ్యానికి గురై కన్నుమూశారు. ఈ విషయాన్ని ఆమె కుమార్తె శ్రబానీ సేన్ తన ఫేస్‌బుక్ ఖాతాలో వెల్లడించారు. సుమిత్రా సేన్ చాలా రోజులుగా అనారోగ్యంతో పాటు వృద్దాప్య సమస్యలతో బాధపడుతున్నారు. ఇటీవల ఆమె ఆరోగ్యం మరింతగా క్షీణించడంతో గత నెల 29వ తేదీన ఆస్పత్రిలో చేర్చగా, అక్కడ చికిత్స పొందుతూ బుధవారం తుదిశ్వాస విడిచారు. 
 
కాగా, సుమిత్రా సేన్ బ్రోంకోప్ న్యుమోనియా వ్యాధితో బాధపడుతూ వచ్చారు. గత 2012లో బెంగాలీ చిత్రపరిశ్రమకు ఆమె చేసిన సేవకు గుర్తింపుగా ఆ రాష్ట్ర ప్రభుత్వం సంగీత్ మహా సమ్మాన్ అవార్డును ప్రదానం చేసింది. ఆ తర్వాత కూడా రవీంద్ర సంగీత వారసత్వాన్ని కొనసాగిస్తూ చ్చారు. తన పాటల ద్వారా ఆ వారసత్వాన్ని సజీవంగా ఉంచినందుకు సుమిత్రా సేన్‌కు ఈ గౌరవం లంభించింది.