బుధవారం, 25 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : శనివారం, 28 నవంబరు 2020 (07:30 IST)

దుర్గమ్మకు బంగారు కాసులపేరు

విజయవాడకు చెందిన దొడ్డపనేని విజయ్ కుమార్ శ్రీ దుర్గ అమ్మవారికి అలంకరణ నిమిత్తం సుమారు 23 గ్రాములు బరువు కలిగిన బంగారు కాసులపేరును ఆలయ కార్యనిర్వహణాధికారి ఎం.వి.సురేష్ బాబుని కలిసి దేవస్థానమునకు విరాళముగా అందజేసినారు.

ఇందులో 61 ఎరుపు రాళ్ళు మరియు 62 లక్ష్మీ కాసులు ఉన్నవి.  ఆలయ అధికారులు దాతకు అమ్మవారి దర్శనము కల్పించిన అనంతరము   అమ్మవారి చిత్రపటం, శేషవస్త్రము, ప్రసాదము అందజేసినారు.