శుక్రవారం, 24 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : శుక్రవారం, 9 ఆగస్టు 2019 (06:15 IST)

రాష్ర్టపతితో గవర్నర్ భేటీ

భారత రాష్ట్రపతి  రామ్ నాథ్ కోవింద్ ను ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ గురువారం రాష్ట్రపతి భవన్ లో మర్యాదపూర్వకంగా కలసి సంభాషించారు. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర విభజన అనంతరం రాష్ట్ర నూతన గవర్నర్ గా బాధ్యతలు చేపట్టిన  గౌరవ బిశ్వభూషణ్ హరిచందన్ తొలిసారిగా దేశ రాజధానిలో మూడురోజుల పర్యటనకు బుధవారం రాత్రి న్యూ ఢిల్లీ చేరుకున్నారు. 

గురువారం ఉదయం 11గంటలకు రాష్ట్రపతి భవన్ చేరుకొని భారత రాష్ట్రపతి  శ్రీ రామ్ నాథ్ కోవింద్ ను మర్యాదపూర్వకంగా కలిసికొని సంభాషించారు. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర పరిస్థితులను గౌరవ రాష్ట్రపతికి విశదీకరించారు. 
గవర్నర్ కార్యదర్శి ముఖేష్ కుమార్ మీనా, ఎ.డి.సి., మాధవ రెడ్డి, ఆంధ్ర ప్రదేశ్ భవన్ అదనపు రెసిడెంట్ కమీషనర్, ఓ.ఎస్.డి., శ్రీమతి భావనా సక్సేనా గవర్నర్ వెంట వున్నారు.