1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By
Last Updated : సోమవారం, 11 మార్చి 2019 (16:59 IST)

తల్లి ఫోటోను ఇన్‌స్టాలో అప్‌లోడ్ చేశాడు.. ఎందుకన్నందుకు?

మహిళలపై అత్యాచారాలు ఎక్కువైపోతున్నాయి. దీనికితోడుగా అసభ్యకరమైన ఫోటోలు తీసి ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్ వంటి వాటిల్లో పెడుతున్నారు. ఇలాంటి సంఘటన హైదరాబాద్‌లో జరిగింది. తన తల్లి ఫోటోను సామాజిక మాధ్యమాలలో పోస్ట్ చేసి అసభ్యకర సందేశం ఎందుకు రాశావని అడిగిన కొడుకును ఇంటి యజమాని యాసిడ్ పోసి రాడ్‌తో దాడి చేశాడు. ఈ ఘటన సంతోష్‌నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో వెలుగులోకి వచ్చింది. 
 
పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం.. సంతోష్‌నగర్‌‍లోని రాజనరసింహ్మానగర్ హనుమాన్ వీధికి చెందిన మహ్మద్ సర్వర్ ఖాన్ ఇంట్లో గతకొన్ని నెలలుగా మహ్మద్ అబ్దుల్ ఫారూఖ్ కుటుంబం అద్దెకు ఉండేది. కొన్ని రోజుల క్రితం ఇంటిని ఖాళీ చేశారు. ఓరోజు ఫారూఖ్ తల్లికి సంబంధించిన ఫోటోను ఇంటి యజమాని సర్వర్ ఇన్‌స్టాగ్రామ్‌లో అప్‌లోడ్ చేయడమే కాకుండా.. అసభ్యకర సందేశాన్ని కూడా రాశాడు.
 
దీనిని గమనించిన ఫారూఖ్ మార్చి 7వ తేదీన ఇంటి యజమాని వద్దకు వెళ్లి.. నా తల్లి గురించి ఎందుకు అలా రాశావంటూ ప్రశ్నించాడు. దీంతో ఆగ్రహానికి గురైన సర్వర్ ఖాన్, కుటుంబ సభ్యులు తయ్యబా, ఆసీఫా బేగం.. ఫారూఖ్ శరీరంపై యాసిడ్ చల్లి కారం పోసి.. ఇనుప రాడ్‌తో దాడి చేశారు. తీవ్ర గాయాలపాలైన ఫారూఖ్ అక్కడి నుండి పరిగెత్తుకొచ్చి ప్రాణాలు కాపాడుకున్నాడు. ప్రస్తుతం ఇతడు ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్నాడు. బాధితుడి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.