సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By జె
Last Modified: బుధవారం, 9 డిశెంబరు 2020 (22:56 IST)

ఐఎఎస్, ఐపిఎస్‌లు రైతులుగా మారి పొలంలోకి దిగి..?

వృత్తిరీత్యా ఒకరు జిల్లాస్థాయి అధికారి.. ఇద్దరు అర్బన్ జిల్లా ఉన్నతాధికారులు. వృత్తిని మర్చిపోయారు. రైతులను చూసి వెంటనే పొలంలోకి దిగారు. పొలంలో వరినాట్లు వేశారు. ఐఎఎస్, ఐపిఎస్ స్థాయిని మరిచి వరి నాట్లు వేశారు. తాము రైతు బిడ్డలమని నిరూపించుకున్నారు. ఈ సంఘటన చిత్తూరు జిల్లాలో చోటుచేసుకుంది. 
 
ఒకరేమో చిత్తూరు జిల్లా కలెక్టర్ భరత్ నారాయణ్ గుప్త, మరొకరేమో తిరుపతి అర్బన్ జిల్లా ఎస్పీ రమేష్ రెడ్డి. ఇంకొకరు తిరుపతి నగర పాలకసంస్థ కమిషనర్ గిరీషా.. వీరు ముగ్గురు ఐఎఎస్, ఐపిఎస్ చేసిన వారే. తమ పరిపాలనతో అందరి మన్ననలను పొందుతున్నారు. అయితే వీరు ముగ్గురు ఒకేచోట కలిశారు. 
 
తిరుపతికి సమీపంలోని ఒక పొలంలో దిగారు ముగ్గురు. వృత్తిని పక్కనబెట్టి వరినాట్లు నాటారు. ఆనందంగా ముగ్గురు గంటపాటు పొలంలోనే గడిపారు. స్వతహాగా రైతు కుటుంబం నుంచి వీరు రావడంతో పాతజ్ఞాపకాలను నెమరవేసుకున్నారు. ఉన్నతాధికారులు పొలంలో దిగి పనులు చేయడం చూసి జనం ఆశ్చర్యానికి గురయ్యారు.