శనివారం, 9 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : శనివారం, 4 ఏప్రియల్ 2020 (08:11 IST)

మనోభావాలు దెబ్బతీసేలా తప్పుడు పోస్టులు పెడితే కఠిన చర్యలు: శ్రీకాంత్‌రెడ్డి

కరోనా లాంటి విపత్కర పరిస్థితుల్లో కులమాతలను బయటికి తీసుకొచ్చి మాట్లాడటం దుర్మార్గమని సామాజిక మాధ్యమాలలో మనోభావాలు దెబ్బతీసేలా తప్పుడు పోస్టులు పెడితే కఠిన చర్యలు తీసుకుంటారని ప్రభుత్వ చీఫ్‌ విప్‌ గడికోట శ్రీకాంత్‌రెడ్డి హెచ్చరించారు. 

పారిశుధ్య కార్మికులు, పోలీసులు, రెవిన్యూ, విద్యుత్ శాఖ సిబ్బంది, వైద్యులు, జర్నలిస్టులు ప్రాణాలకు తెగించి మీకోసం పోరాడుతున్నారన్నారు

రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అస్తవ్యస్తంగా ఉన్న సమయంలో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి రాత్రింబవళ్లు పనిచేస్తున్నారని పేర్కొన్నారు. అష్టకష్టాలు పడుతున్న పరిస్థితిలో సైతం ప్రజల బాగుకోసం రూ. 15 కోట్లు వెచ్చించి ఒక్కొక్క కార్డుకు వెయ్యి రూపాయలు, ఒక నెల వ్యవధిలో మూడు సార్లు ఉచితంగా రేషన్ అందిస్తున్నారు.

ప్రజలు కరోనా పట్ల నిర్లక్ష్యం చేయకుండా ఇండ్ల నుంచి బయటికి రావద్దని, ప్రతిరోజు కురగాయలు లేకపోయిన పచ్చడి మెతుకులు అయిన తిని బతుకుదాం అని పేర్కొన్నారు.

ఈ సందర్భంగా తాను కూడా ప్రజలు రెండు కాళ్లు పట్టుకొని వేడుకుంటున్నాని తెలిపారు. అత్యవసర పరిస్థితి అయితే తప్ప బయటికి ఎవరు రావద్దని వెల్లడించారు.