శుక్రవారం, 10 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ivr
Last Modified: బుధవారం, 12 ఏప్రియల్ 2017 (15:22 IST)

పవన్‌ను భ్రష్టుపట్టించే కార్యక్రమాలు చాలానే జరుగుతున్నాయ్...

2019 ఎన్నికలు సమీపిస్తున్నకొద్దీ జనసేన పార్టీ ఎటువైపు అనే చర్చ ఎక్కువవుతోంది. ఇదిలావుంటే పవన్ కళ్యాణ్ కాపు కులానికి చెందినవాడయినప్పటికీ, ఆయన కులం, మతం అంటే తనకు అస్సలు కిట్టవని అంటుంటారు. విచిత్రమేమిటంటే... ఆయన తమ కులానికి చెందినవాడంటూ కాపులు తమ సభలక

2019 ఎన్నికలు సమీపిస్తున్నకొద్దీ జనసేన పార్టీ ఎటువైపు అనే చర్చ ఎక్కువవుతోంది. ఇదిలావుంటే పవన్ కళ్యాణ్ కాపు కులానికి చెందినవాడయినప్పటికీ, ఆయన కులం, మతం అంటే తనకు అస్సలు కిట్టవని అంటుంటారు. విచిత్రమేమిటంటే... ఆయన తమ కులానికి చెందినవాడంటూ కాపులు తమ సభలకు పిలుస్తున్నారు కొందరు. ఇంకొందరు మెగాస్టార్ ఫ్యామిలీలో ఇద్దరు రెడ్డి సామాజిక వర్గానికి చెందిన అమ్మాయిలను చేసుకున్నారు కాబట్టి తమకూ పవన్ మద్దతు వుంటుందనీ, రెడ్డి సామాజికవర్గం కూడా ఆయన్ను పిలుస్తోంది. 
 
ఇకపోతే అసలు పవన్ కళ్యాణ్ సినిమాల్లోకి ఎంటర్ కావడానికి చిరంజీవి కారణం కాబట్టి ఆయన కాంగ్రెస్ పార్టీకి మద్దతు తెలిపాలని ఇంకొందరు అంటున్నారు... ఇలా పవన్ ని భ్రష్టు పట్టించే కార్యక్రమాలు చాలానే జరుగుతున్నాయనుకోండి. ఇలాంటి ఫార్ములాల్లో ఏదో ఒక ఫార్ములాకు పవన్ కళ్యాణ్ లొంగి వస్తాడేమోనన్న ఆశలతో ఎదురుచూస్తున్నారు చాలామంది. 
 
ఐతే పవన్ మాత్రం అవసరమయితే వామపక్షాలతో కలిసి పోరాటం చేస్తానని అంటున్నారు. ఈ లెక్కన ఆయన తెదేపా, వైసీపీ, భాజపాలలో ఏ పార్టీతోనూ కలిసి ఎన్నికలకు వెళ్లరని తెలుస్తోంది. కానీ పార్టీలు మాత్రం తమ పని తాము చేస్తున్నాయి. రాళ్లు విసురుతూనే వున్నాయి. ఏదో ఒక రాయి తగలకపోతుందా అని.
 
కొసమెరుపు ఏంటంటే... కొత్తగా మంత్రి అయిన సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి చిరంజీవి, పవన్ కళ్యాణ్ తల్లిగారయిన అంజనాదేవిని కలిసి ఆమె దీవెనలు అందుకున్నారు. నెల్లూరులో కాపు సామాజిక వర్గం మెగా ఫ్యామిలీకి బాగా మద్దతు వుందని ఇలా భేటీ అయివుంటారని కొందరంటుంటే... అదేమీ కాదని మరికొందరు అంటున్నారు.