శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సెల్వి
Last Updated : ఆదివారం, 15 డిశెంబరు 2019 (18:10 IST)

కలెక్టర్లను, ఎస్పీలను విందుకు పిలిచిన వైఎస్ జగన్!

ఆంధ్రప్రదేశ్‌లోని కలెక్టర్లు, ఎస్పీలకు విందు ఇవ్వాలని సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నిర్ణయించారు. ఈ మేరకు మంగళవారం నాడు తానిచ్చే విందుకు హాజరు కావాలని అందరికీ ఆహ్వానాలు పంపారు. 
 
ఈ కార్యక్రమానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలతో పాటు వివిధ విభాగాల పోలీసు కమిషనర్‌లు కూడా హాజరు కానున్నారు.
 
జిల్లాకు ఒకటి చొప్పున మొత్తం 13 టేబుల్స్ ఏర్పాటు చేయనుండగా, ఒక్కో టేబుల్ వద్ద కనీసం 10 నిమిషాల పాటు జగన్ గడుపుతారని, జిల్లాల పరిస్థితులు, సమస్యల గురించి అడిగి తెలుసుకుంటారని, వాటికి పరిష్కార మార్గాలపై సలహాలు అడుగుతారని తెలుస్తోంది. 
 
ఇక ఈ విందులో సంప్రదాయ ఆంధ్రా వంటకాలతో పాటు నార్త్, సౌతిండియన్ వంటలను వండి వడ్డిస్తారని సీఎంఓ తెలిపింది.