శుక్రవారం, 22 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సెల్వి
Last Updated : సోమవారం, 23 సెప్టెంబరు 2024 (11:49 IST)

చంద్రబాబు అబద్ధాలకోరు.. ప్రధాని సార్ జోక్యం చేసుకోండి.. జగన్

jagan
ముఖ్యమంత్రి ఎన్‌ చంద్రబాబు నాయుడును "అబద్ధాలకోరు"గా వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అభివర్ణించారు. తిరుపతి లడ్డూ కల్తీ వ్యవహారంలో ప్రధాని నరేంద్ర మోదీ జోక్యం చేసుకోవాలని.. ఈ వ్యవహారంలో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడును మందలించాలని కోరారు. 
 
కేవలం రాజకీయ ప్రయోజనాల కోసం కోట్లాది ప్రజల విశ్వాసాలను దెబ్బతీసేలా సీఎం నాయుడు దిగజారిపోయారని ప్రధాని మోదీకి రాసిన ఎనిమిది పేజీల లేఖలో జగన్ ఆరోపించారు. నెయ్యి స్వీకరించడానికి తిరుమల-తిరుపతి దేవస్థానం (టిటిడి)లో చేపట్టిన ప్రక్రియను వివరిస్తూ, సీఎం స్థాయిని మాత్రమే కాకుండా, ప్రజా జీవితంలోని ప్రతి ఒక్కరిని, టిటిడి పవిత్రతను చంద్రబాబు దిగజార్చారని పైర్ అయ్యారు. 
 
ఈ వ్యవహారంలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ జోక్యం చేసుకోవాలని.. తిరుమల పవిత్రతను కూడా రాజకీయాల కోసం ఉపయోగిస్తున్న చంద్రబాబును మందలించాలని జగన్ విజ్ఞప్తి చేశారు. టీటీడీ పనితీరుపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పచ్చి అబద్ధాలు ప్రచారం చేశారని వైఎస్ జగన్ మండిపడ్డారు. 
 
టీటీడీ పవిత్రతను పునరుద్ధరించాలని లేఖలో కోరిన జగన్, సున్నితమైన అంశాన్ని జాగ్రత్తగా హ్యాండిల్‌ చేయకపోతే చాలా తీవ్రమైన, విస్తృత పరిణామాలుంటాయన్నారు.