1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సెల్వి
Last Updated : బుధవారం, 11 జనవరి 2023 (11:45 IST)

మూడో విడత జగనన్న చేదోడు నిధులు విడుదల

ys jagan
ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి మూడో విడత జగనన్న చేదోడు నిధులు జనవరి 11న విడుదల చేయనున్నారు. ఈ పథకం కింద రాష్ట్రంలోని 3.95 లక్షల మంది చిన్న,చిరు వ్యాపారులు తమ వ్యాపారాన్ని మెరుగుపరచుకోవడానికి ఒక్కొక్కరికి రూ. 10,000 వరకు వడ్డీ రహిత రుణాన్ని పొందుతారు. 
 
గత ఏడాది లబ్ధిదారులు పొందిన రుణానికి ఆరు నెలల వడ్డీకి రూ. 15.17 కోట్లు కాకుండా కొత్త లబ్ధిదారులకు రూ. 395 కోట్ల వడ్డీ లేని రుణాన్ని సీఎం విడుదల చేస్తారు.
 
ఈ మూడో విడత జగనన్న చేదోడుతో మొత్తం లబ్ధిదారుల సంఖ్య 15.31 లక్షలకు చేరుకుంటుంది. వడ్డీలేని రుణం మొత్తం రూ. 2,406 కోట్ల మార్కుకు చేరుతుందని అధికారులు చెప్పారు. మొత్తం లబ్ధిదారులలో, కనీసం 8.74 లక్షల మంది మునుపటి మొత్తాన్ని తిరిగి చెల్లించిన తర్వాత రెండవసారి రుణాన్ని పొందారు.