మంగళవారం, 19 ఆగస్టు 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సెల్వి
Last Updated : గురువారం, 5 ఆగస్టు 2021 (12:01 IST)

సీఎం జగన్ మరో అద్భుత కార్యక్రమం.. పచ్చతోరణం కార్యక్రమానికి శ్రీకారం

ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్ మోహన్ రెడ్డి మరో అద్భుత కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. పర్యావరణాన్ని పరిరక్షించడానికి, వాతావరణ సమతుల్యతను కాపాడటానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఇప్పటికే జగనన్న పచ్చతోరణం కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. 
 
రాష్ట్ర వ్యాప్తంగా మొక్కలు నాటే కార్యక్రమాన్ని నిర్వహించాలని, పర్యావరణాన్ని పరిరక్షించాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న వన మహోత్సవ కార్యక్రమానికి మంగళగిరి ఎయిమ్స్ వేదికగా బీజం పడనుంది.  
 
జాతీయ అటవీ విధానానికి అనుగుణంగా 33 శాతం పచ్చదనం పెంపొందిస్తూ ఆకుపచ్చని ఆంధ్రావని సాధనే లక్ష్యంగా జగనన్న పచ్చతోరణం కార్యక్రమం కొనసాగనుంది. జగనన్న పచ్చ తోరణంలో భాగంగా ప్రతి ఏటా వర్షాకాలంలో మొక్కలు నాటే కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న అటవీశాఖ, వన మహోత్సవం పేరుతో ఈసారి భారీ ఎత్తున మొక్కలు నాటే కార్యక్రమాన్ని చేపట్టింది