శనివారం, 25 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : బుధవారం, 6 జనవరి 2021 (20:30 IST)

ఇళ్లపట్టాల పంపిణీలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం రూ.6,500కోట్ల అవినీతి: టీడీపీ

రాష్ట్రాన్ని అవినీతిమయం చేసిన జగన్మోహన్ రెడ్డి, ఆయన ప్రభుత్వం కేవలం ఇళ్లపట్టాల పంపిణీలోనే రూ.6,500కోట్లవరకు అవినీతికిపాల్పడ్డారని, ఇళ్లపట్టాల పంపిణీ ముసుగులో అధికారపార్టీకి చెందిన దాదాపు 40మంది ఎమ్మెల్యేలతో సహా, ముఖ్యమంత్రికి కనకాభిషేకం జరిగిందని టీడీపీఎమ్మెల్సీ బీ.టీ.నాయుడు స్పష్టంచేశారు. బుధవారం ఆయన మంగళగి రిలోని పార్టీ జాతీయ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. 
 
ఇళ్లపట్టాల పంపిణీ పథకంలో జరిగిన అవినీతిని ఆధారాలతో సహా నిరూపించడానికి తాము సిద్ధంగా ఉన్నామని, సమయం, తేదీ చెప్పి, ఎక్కడికి రావాలో చెబితే అక్కడికొచ్చే జగన్మోహన్ రెడ్డి అండ్ కో దోపిడీనీ బయటపెడతామని, వైసీపీవారుగానీ, ప్రభుత్వంలోని వారుగానీ చర్చకు రావడానికి సిద్ధమా అని టీడీపీనేత నాయుడు సవాల్ విసిరారు. ఇళ్లపట్టాల పంపిణీ ముసుగులో ముఖ్యమంత్రి చేసిన ప్రచారం అంతా ఇంతా కాదన్నారు. 

ఇళ్లపట్టాల పంపిణీ వ్యవహారంలోజరిగిన అవినీతి విషయానికొస్తే, తెనాలి నియోజకవర్గంలో రూ.5లక్షలకు రైతులనుంచి భూమిని కొని, దాన్నిఇళ్లపట్టాలకోసం ప్రభుత్వానికి రూ.70లక్షలకు అమ్మడం జరిగిందన్నారు. ఈ వ్యవహారం మీడియాకు తెలిసి, బయటకు పొక్కడంతో కోర్టు జోక్యంతో ఇళ్లపట్టాల పంపిణీ నిలిచిపో యిందన్నారు.

అలానే కావలి వైసీపీఎమ్మెల్యే ప్రతాపరెడ్డి, గత ఏడాది జూలై 1న తన పనివాళ్లు, అనుచరుల పేరుతో 13ఎకరాలు కొని, ఆ భూమిని ఇళ్లపట్టాలకు వినియోగించాలని 3వతేదీన నెల్లూరు జిల్లా కలెక్టర్ కు సిఫార్సుచేయడ జరిగిందన్నారు. అందు కు కలెక్టర్ ఒప్పుకోకపోవడంతో జిల్లా మంత్రి అనిల్ కుమార్ తో చెప్పి, సదరు ఐఏఎస్ అధికారిని బదిలీ చేయించారని నాయుడు తెలిపారు.

తణుకు ఎమ్మెల్యే కారుమూరి నాగేశ్వరరావు భూముల కొనుగోలులో రూ.57.75కోట్ల అవినీతికి పాల్పడ్డారని, ఆ వ్యవహారంపై స్థానిక వైసీపీనేత సీతారామ్ ముఖ్యమంత్రికే లేఖ రాయడం జరిగిందన్నారు.  పెందుర్తి వైసీపీ ఎమ్మెల్యే అదీప్ రాజు 8.78 ఎకరాల విస్తీర్ణమున్న వీర్రాజు చెరువుని ఆక్రమించి, ఇళ్లపట్టా ల పంపిణీకి వినియోగించాలని చూశారన్నారు.

పెనమలూరు ఎమ్మెల్యే కొలుసుపార్థసారథి  503ఎకరాలకు సంబంధించి, రూ.133కోట్ల వరకు స్వాహా చేశారన్నారు. రూ.25నుంచి రూ.30లక్షల విలువచేసే భూమిని రూ.70లక్షలకు ప్రభుత్వానికి అంటగట్టడం ద్వారా పార్థసారథి రూ.133కోట్లు మింగేశాడని టీడీపీ నేత ఆగ్రహం వ్యక్తంచేశారు.  ఈ విధంగా చెప్పుకుంటూ పోతే, అనేక మంది ఉన్నారని, వారందరి బాగోతాన్ని టీడీపీ ఆధారాలతోసహా  బయటపెట్టినా అందరూ తేలుకుట్టిన దొంగల్లా మిన్నకుండి పోయారన్నారు. 

ప్రజలకోసమే మాశ్వాస, ధ్యాస అనిచెప్పుకునే వైసీపీనేతలు, ముఖ్యమంత్రి విలాసవంతమైన రాజభవనాల్లో జీవిస్తూ, పేదలకు మాత్రం చారెడుజాగా ఇస్తూ, దానిలోకూడా అందినకాడికి దోచేశార న్నారు. పేదలకు ఊళ్లకు దూరంగా ఇచ్చిన ఇంటిస్థలాల్లో  ముఖ్యమంత్రి, మంత్రులు  ఎవరైనాసరే నివాసాలు కట్టుకొని అక్కడ ఉండటానికి సిద్ధంగా ఉన్నారా అని బీ.టీ.నాయుడు ప్రశ్నించారు.