ఆదివారం, 29 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By జె
Last Modified: బుధవారం, 13 జనవరి 2021 (19:02 IST)

పట్టర పట్టు.. చిత్తూరు జిల్లాలో జల్లికట్టు, రక్తమోడుతూ ఒకవైపు, కోడిగిత్తల కొమ్ములను విరుస్తూ..?

జల్లికట్టు. సాధారణంగా జల్లికట్టు సంక్రాంతి పండుగ నాడే వస్తుంటుంది. తమిళనాడు రాష్ట్రం నుంచి ఆంధ్రప్రదేశ్ లోకి వచ్చిన ఆచారం ఇది. ప్రతి యేటా రైతులే స్వయంగా ఈ జల్లికట్టులో పాల్గొంటూ ఉంటారు. ముఖ్యంగా యువకులు పండుగ వాతావరణంలో ఈ జల్లికట్టును జరుపుకుంటూ ఉంటారు.
 
నోరులేని మూగజీవాలను హింసించకండి.. వాటితో ఆడుకోకండి అంటూ పోలీసులు ఆంక్షలు విధించినా సరే చిత్తూరు జిల్లాలో గ్రామస్థులు మాత్రం పట్టించుకోరు. వారికి వారే జల్లికట్టును నిర్వహిస్తూ ఉంటారు. ఈరోజు జరిగిన జల్లికట్టు కాస్త రక్తసిక్తంగా మారింది. చిత్తూరుజిల్లాలోని అన్పుపల్లిలో జరిగిన జల్లికట్టులో కోడిగిత్తల(పశువులు)ను పట్టేందుకు యువకులు పోటీలు పడ్డారు. పశువులకు కట్టిన బహుమతులను లాక్కునేందుకు ప్రయత్నించారు. ఎవరైతే బహుమతులను తీసుకుంటారో వారే ఆ గ్రామానికి మొనగాడు అని అర్థం.
 
అందుకే యువకులు పోటీలు పడ్డారు గానీ చాలామంది యువకులకు గాయాలయ్యాయి. ముఖ్యంగా నోరులేని మూగజీవాలు కూడా గాయపడాల్సిన పరిస్థితి ఏర్పడింది.