శుక్రవారం, 27 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By
Last Updated : సోమవారం, 15 జులై 2019 (14:26 IST)

రేయ్.. నా కొడకల్లారా.. బయటకు వస్తున్నా.. ఏ రెడ్డి వస్తాడో చూస్తా : జేసీ ప్రభాకర్ వీరంగం

అనంతపురం జిల్లా తెలుగుదేశం పార్టీకి చెందిన సీనియర్ నేత జేసీ ప్రభాకర్ రెడ్డి మరోమారు నోరుపారేసుకున్నారు. రాష్ట్రంలో అధికార మార్పిడి జరగడంతో ఆయన వద్ద ఉన్న ద్వితీయశ్రేణి నేతలంతా ఇతర పార్టీల్లోకి వెళుతున్నారు. దీంతో ఆయన ఏకాకి అయిపోతున్నాననే ఫీలింగ్ ఏర్పడి, ఆందోళనకు గురయ్యాడు.
 
దీంతో ఆయన తిట్ల దండకం ఎత్తుకున్నాడు. "రేయ్‌ సుబ్బారావు నీ లారీలన్నీ తిరుగుతాయా... నా కొడకుల్లారా నేను కూడా ఈ రోజు బయటకు వస్తున్నా... మీరు పోవాలా నా కొడకల్లారా.... మీ లారీలు అన్ని తిరుగుతాయా... రా నువ్వు వచ్చి నాతో మాట్లాడిపో... ఏ రెడ్డి వస్తాడో చూస్తాం" అంటూ రెచ్చిపోయాడు. జేసీ ప్రభాకర్ రెడ్డి తాజాగా చేసిన వ్యాఖ్యలు సంచలనం కలిగించాయి. 
 
కర్నూలు జిల్లా కనకాద్రిపల్లికి చెందిన సుబ్బారావు అనే వ్యక్తి జేసీ సోదరుల అండతో తాడిపత్రిలో గ్రానైట్‌ రవాణా చేసేవాడు. రాష్ట్రంలో ప్రభుత్వం మారిన తర్వాత జేసీ సోదరుల ఆగడాలకు బ్రేక్‌పడుతూ వచ్చింది. దీంతో తన పంచన ఉంటూ బానిసలుగా బతికిన వారు ఒక్కొక్కరుగా టీడీపీని వీడి వీడుతుండటాన్ని జీర్ణించుకోలేక పోయాడు. 
 
ఈ క్రమంలో ఆదివారం గ్రానైట్‌ వ్యాపారి సుబ్బారావుకు జేసీ ప్రభాకరరెడ్డి ఫోన్‌ చేసి బెదిరించాడు. నోటికొచ్చిన బూతులన్నీ తిట్టారు. దీంతో సదరు సుబ్బారావు  'అయ్యా వస్తాలే' అని చెప్పి... మరో టీడీపీ కార్యకర్త కొనంకి రమేష్‌ నాయుడుతో కలిసి వెంటనే మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్‌రెడ్డి వద్దకు వెళ్లాడు. వారు కనిపించగానే జేసీ ప్రభాకరరెడ్డి మరోసారి బూతులతో వారిపై విరుచుకుపడ్డాడు. తనను కాదని వెళ్తే అంతేనంటూ బెదిరించాడు. దీంతో వారు తిరిగి పచ్చకండువా కప్పుకుని ఆయన పంచన చేరారు.