శుక్రవారం, 27 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : శనివారం, 7 నవంబరు 2020 (09:08 IST)

ఉద్యోగ అవకాశాలు: రేపు ఆరోగ్యశ్రీ హెల్త్ కేర్ ట్రస్ట్ పరీక్ష

డా. వై ఎస్ ఆర్ ఆరోగ్యశ్రీ హెల్త్ కేర్ ట్రస్ట్ విభాగంలో ఆరోగ్య మిత్ర, టీం లీడర్ ఉద్యోగాలకు దరఖాస్తులు చేసుకున్న అభ్యర్థులకు ఈ నెల 8 న మచిలీపట్టణం కృష్ణా యూనివర్సిటీ, కోనరోడ్, రుద్రవరం,  ప్రాంగణంలో కంప్యూటర్ పరీక్ష దశల వారీగా నిర్వహించనున్నట్లు జిల్లా కోఆర్డినేటర్ ఆరోగ్యశ్రీ డా. వై బాల సుబ్రహ్మణ్యం, ఒక ప్రకటనలో తెలిపారు.

పరీక్షకు హాజరయ్య అభ్యర్థులు ఆధార్ కార్డు విధిగా తీసుకు రాగలరు. పరీక్ష హాల్ దూరం కావున అభ్యర్థులు పరీక్షా కేంద్రంకు త్వరగా చేరుకోవలసిందిగా కోరడమైనది.

ఆరోగ్య మిత్ర, టీం లీడర్ ఉద్యోగాలకు డి (డాక్టర్ అఫ్) ఫార్మసీ, ఏంబిఏ, ఏంఏ, బిస్సీ కంప్యూటర్, ఇంటర్మీడియట్ అభ్యర్థులు అర్హులు కాదని పేర్కొన్నారు.