శుక్రవారం, 10 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సెల్వి
Last Updated : శుక్రవారం, 3 సెప్టెంబరు 2021 (11:06 IST)

కడప జిల్లాలో దారుణం.. సొంత చెల్లెలి కొడుకే..?

కడప జిల్లాలో దారుణం జరిగింది. సొంత చెల్లెలి కొడుకే.. పెద్దమ్మను, పెదనాన్నను దారుణంగా హతమార్చాడు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. 
 
వివరాల్లోకి వెళితే.. కడప జిల్లాలోని బ్రహ్మంగారి మఠం మండలం కొత్త బసాపురంలో నాగయ్య - నాగమ్మ దంపతులు దారుణ హత్యకు గురయ్యారు.  తెల్లవారుజామున ఇంట్లో నిద్రిస్తుండగా వీరయ్య అనే వ్యక్తి దంపతులపై దాడి చేసి కిరాతకంగా హత్య చేశాడు.  
 
హంతకుడు వీరయ్య నాగమ్మకు స్వయానా చెల్లెలు కొడుకు. వీరి స్వగ్రామం చాపాడు మండలం నాగులపల్లి. అయితే నిందితుడి మానసిక పరిస్థితి సరిగా లేక పెద్దమ్మ నాగమ్మ, పెదనాన్న నాగయ్యను హత్య చేసినట్లు పోలీసుల విచారణలో వెల్లడైంది. హత్యకు పాల్పడిన వీరయ్య ఆ ప్రదేశంలోని ఓ ఇంట్లో దాగి ఉండగా పోలీసులు పట్టుకున్నట్లు సమాచారం.