సోమవారం, 27 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఆర్. సందీప్
Last Modified: మంగళవారం, 9 జూన్ 2020 (23:08 IST)

ప్రియురాలి కోసం భార్యను చంపాడు, ఆ తర్వాత

పరాయి స్త్రీపై మోజు పెంచుకుని కట్టుకున్న భార్యను హతమార్చాడు. గుట్టు చప్పుడు కాకుండా పాతిపెట్టాడు. నాలుగేళ్లు నిజం బయటకు కక్కకుండా జాగ్రత్త వహించాడు. చివరికి ప్రియురాలిని కూడా పొట్టనబెట్టుకున్నాడు. ఆరా తీసిన పోలీసులకు నిజం తెలియడంతో కంగుతిన్నారు. ఈ ఘటన అనంతపురం జిల్లాలోని సోమందేపల్లి మండలంలో చోటుచేసుకుంది.
 
రామాంజి అనే వ్యక్తి పత్తికుంటపల్లిలో ఉండే మారెక్కను పెళ్లి చేసుకున్నాడు. కొద్ది రోజుల తర్వాత సంజీవమ్మ అనే పరాయి మహిళతో అక్రమ సంబంధం పెట్టుకుని, అడ్డుగా ఉందని భార్యను చంపేశాడు. శవాన్ని ఇంట్లోనే గొయ్యి త్రవ్వి పాతిపెట్టాడు. నాలుగేళ్ల పాటు ప్రియురాలితో కలిసి రాసలీలలు సాగించాడు. చివరికి ప్రియురాలితో విభేదాలు తలెత్తడంతో ఆమెను కూడా హత్య చేసాడు.
 
విషయం తెలుసుకున్న పోలీసులు విచారించడంలో గుట్టు బయటకు వచ్చింది. ఇంట్లో శవాన్ని పాతిపెట్టిన చోటులో త్రవ్వించి అవశేషాలను ఫోరెన్సిక్ ల్యాబ్‌కి పంపారు. ప్రియురాలి శవానికి కూడా అక్కడే పోస్ట్‌మార్టం నిర్వహించారు. ప్రియురాలి హత్యతో భార్య మర్డర్ వెలుగులోకి రావడం కలకలం రేపింది.