Nara Lokesh: కానిస్టేబుల్ వెంకటరత్నంను కొనియాడిన మంత్రి నారా లోకేష్ (video)
Constable
పేద, పేద పాఠశాల పిల్లలకు సహాయం చేయడంలో గొప్ప సామాజిక స్పృహను ప్రదర్శించిన ట్రాఫిక్ పోలీసు కానిస్టేబుల్ వీడియో చూసి నారా లోకేష్ భేష్ అన్నారు.
పెనమలూరు ట్రాఫిక్ హెడ్ కానిస్టేబుల్ వెంకటరత్నం గారు స్పందించిన తీరుకు హ్యాట్స్ ఆఫ్ అంటూ ప్రశంసించారు. ఎండ, వానల్లో చెప్పులు లేకుండా నడుస్తున్న కొంతమంది పాఠశాల పిల్లలు చూసి ఆయన చాలా బాధపడ్డారు.
వారిని షాపుకు తీసుకెళ్లి చెప్పులు కొనిపెట్టారు. ఈ వీడియో నెట్టింట వైరల్ అయ్యింది. ఈ వీడియో మంత్రి నారా లోకేష్ దృష్టికి వెళ్లింది. దీంతో వెంకటరత్నంను మంత్రి కొనియాడారు.
హ్యాట్సాఫ్ వెంకటరత్నం గారు
— Lokesh Nara (@naralokesh) September 21, 2025
స్పందించిన మీ మనసుకు సెల్యూట్
ఎండనక, వాననక అప్రమత్తంగా ట్రాఫిక్ని నియంత్రించే విధి నిర్వహణ. అటెన్షన్, టెన్షన్లు ఉన్నా పెనమలూరు ట్రాఫిక్ హెడ్ కానిస్టేబుల్ వెంకటరత్నం గారు స్పందించిన తీరుకు హాట్సాఫ్.
చెప్పుల్లేకుండా ఎండలో నడిచి వెళ్తున్న స్కూల్… pic.twitter.com/d2YiMD8xOm
