ఆదివారం, 29 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సెల్వి
Last Updated : సోమవారం, 6 నవంబరు 2023 (19:18 IST)

మీ పనిని చూసుకోండి.. సజ్జలపై షర్మిల ఫైర్

ys sharmila
వైఎస్ కుటుంబాన్ని వేధింపులకు గురిచేసిన కాంగ్రెస్‌తో చేతులు కలిపానని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సలహాదారు, వైసీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి చేసిన వ్యాఖ్యలకు వైఎస్సార్టీపీ అధినేత షర్మిల ధీటుగా సమాధానం ఇచ్చారు. 
 
మొదట, నా పార్టీ గురించి అభిప్రాయాలు చెప్పకుండా మీ పనిని చూసుకోండి.. అంటూ ఫైర్ అయ్యింది. ఇంకా షర్మిల మీడియాతో మాట్లాడుతూ, తెలంగాణ రాజకీయాల్లోకి వచ్చిన వెంటనే షర్మిలతో వైసీపీకి ఎలాంటి సంబంధం లేదని ప్రకటించిన మొదటి వ్యక్తి సజ్జలే అని గుర్తు చేశారు. 
 
తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావు అభివృద్ధిలో వెనుకబడి ఉందని, తెలంగాణతో పోల్చి చూస్తే "సింగిల్‌ రోడ్డు, చీకటిలో ఆంధ్రా వుంటే.. డబుల్‌ రోడ్లతో తెలంగాణ వెలిగిపోతుందని కేసీఆర్ బహిరంగంగా విమర్శించారనే అంశాన్ని షర్మిల గుర్తు చేసారు. 
 
పొరుగు తెలుగు రాష్ట్రంలోని ఇతర రాజకీయ పార్టీల గురించి సలహాలు, అభిప్రాయాలు ఇవ్వడం కంటే తమ రాష్ట్ర అభివృద్ధి, ప్రగతిపై దృష్టి సారించాలని సజ్జలకు పరోక్షంగా షర్మిల సూచించారు.