'రాజధాని ద్రోహి' అంటూ నినాదాలు.. మంగళగిరి వైకాపా ఎమ్మెల్యేకు చేదు అనుభవం
గుంటూరు జిల్లా మంగళగిరి వైకాపా ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణరెడ్డికి చేదు అనుభవం ఎదురైంది. రాజధాని ద్రోహి అంటూ నినాదాలు చేశారు. రాజధానిపై తరలింపుపై సమాధానం చెప్పాలని స్థానికుల డిమాండ్ చేశారు. రాజధాని ద్రోహి అంటూ ఆర్కేకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
ఉండవల్లి అంబేద్కర్ నగరులో మంచినీటి పైపు లైను పరిశీలనకు ఆయన వచ్చారు. ఆ సమయంలో అక్కడ కొంతమంది గుమికూడి ఉన్నారు. వారంతా తన కోసమే వచ్చారని భావించిన ఆర్కే వారి ముందు కారు ఆపారు. అయితే, ఆర్కే ఊహించిన విధంగా వారంతా ఆయనకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
అమరాతి నుంచి రాజధాని తరలింపుపై సమాధానం చెప్పాలని వారు డిమాండ్ చేశారు. రాజధాని ద్రోహి అంటూ మండపడ్డారు. దీంతో ఆయన వెంటనే తన వాహనం ఎక్కి అక్కడి నుంచి వెళ్లిపోయారు. స్థానికు మహిళలు సైతం ఆర్కేపై ఆగ్రహం వ్యక్తం చేశారు. గత ఎన్నికల్లో నారా లోకేశ్‌పై ఆర్కే విజయం సాధించింది.