శనివారం, 24 ఫిబ్రవరి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 18 ఫిబ్రవరి 2023 (16:51 IST)

ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

kotamreddy
నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. వైసీపీ నెల్లూరు అధ్యక్షుడు తాటి వెంకటేశ్వర రావుతో పాటు రఘు, జావేద్‌లను అరెస్ట్ చేశారని ఆయన చెప్పారు. షాడో  సీఎం సజ్జల ఆదేశాల మేరకే ఈ అరెస్ట్‌లు జరుగుతున్నాయి.
 
అరెస్ట్‌లపై పోలీసులు సరైన సమాచారం ఇవ్వలేదని.. తాను వేదాయపాలెం స్టేషన్‌కు వెళ్తే.. అక్కడ వెంకటేశ్వర రావు లేకపోవడంతో పోలీసులను నిలదీశానని చెప్పుకొచ్చారు. 24 గంటల్లో న్యాయస్థానంలో ప్రవేశపెడతామని డీఎస్పీ హామీ ఇవ్వడంతో నిరసన విరమించానని తెలిపారు. ఏదైమైనా నేతల అరెస్ట్ చేసిన తీరు సరికాదని హితవు పలికారు. 
 
హైవేపై రాత్రి 11.30 గంటల వరకూ తిప్పారు.. సజ్జల ఆదేశాలను పోలీసులు అమలు చేస్తున్నారని విమర్శించారు. తనను మానసికంగా వేధించాలని చూస్తున్నారని.. కానీ తన అనుచరులు ఎవరూ భయపడరు.. తన డ్రైవర్ కూడా పట్టించుకోడని వార్నింగ్ ఇచ్చారు.