సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By వరుణ్
Last Updated : మంగళవారం, 20 జూన్ 2023 (11:09 IST)

ఏపీ ప్రజలకు ఓ బిగ్ గుడ్ న్యూస్... ఏంటది?

rain
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు వాతావరణ శాఖ ఓ పెద్ద శుభవార్తను చెప్పింది. బిపోర్జాయ్ తుఫాను కారణంగా స్తంభించిపోయిన రుతుపవనాల్లో మళ్లీ చురుకైన కదలిక కనిపిస్తుందని, ఇవి మరో నాలుగు రోజుల్లో రాష్ట్రం అంతటా విస్తరిస్తాయని పేర్కొంది. ముఖ్యంగా, అరేబియా సముద్రంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనంతో రుతుపవనాలు మరింత చురుగ్గా కదులుతున్నాయని, మరో నాలుగు రోజుల్లో రాష్ట్రమంతటా విస్తరిస్తాయని తెలిపారు. 
 
నిజానికి పది రోజుల క్రితమే నైరుతి రుతుపవనాలు రాయలసీమ ప్రాంతాన్ని తాకినప్పటికీ బిపోర్జాయ్ తుఫాను కారణంగా అవి మరింతగా విస్తరించలేదు. ఇపుడు తుఫాను తీరం దాటడంతో ఆదివారం నుంచి మళ్లీ చురుగ్గా కదులడం ప్రారంభించాయని పేర్కొంది. 
 
సోమవారం రాయలసీమ అంతటా విస్తరించాయి. దీంతో చిత్తూరు, తిరుపతి, నెల్లూరు, ప్రకాశం, కర్నూలు జిల్లాల్లో ఓ మోస్తరు వర్షాలు కురుస్తున్నాయి. రుతుపవనాల ప్రభావంతో ఉష్ణోగ్రతలు తగ్గి, పలు ప్రాంతాల్లో ప్రజలకు ఉపశమనం లభించింది. 
 
అత్యాచారం కేసులో పరిపూర్ణానంద స్వామీజీ అరెస్టు 
 
రాజమండ్రికి చెందిన అనాథ బాలికపై గత యేడాదిగా అత్యాచారానికి పాల్పడుతూ వచ్చిన విశాఖలోని జ్ఞానానంద ఆశ్రమ నిర్వాహకుడు పూర్ణానంద స్వామీజీని పోలీసులు అరెస్టు చేశారు. ఆయనపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. చిన్న వయసులోనే బాలిక తల్లిదండ్రులు చనిపోవడంతో బాలికను చేరదీసిన బంధువులు ఐదో తరగతి వరకు చదివించారు. ఆ తర్వాత రెండేళ్ల క్రితం విశాఖలోని కొత్త వెంకోజీ పాళెంలో ఉన్న జ్ఞానానంద ఆశ్రమంలో చేర్పించారు. 
 
అక్కడ ఆ బాలికతో స్వామీజీ ఆవులకు మేత వేయించడం, పేడ తీయడం వంటిపనులు చేయిస్తూ వచ్చారు. రాత్రి సమయంలో తన గదికి తీసుకెళ్లి అత్యాచారం చేసేవాడు. ఇలా ఒక యేడాది కాలంగా ఆ బాలికను తన గదిలోనే గొలుసుతో బంధించాడు. ఎదురు తిరిగితే కొట్టేవాడు. రెండు చెంచాల భోజనం మాత్రమే పెట్టి కాలకృత్యాలకు కూడా అనుమతించకపోయేవానరని వారానికి ఒకసారి మాత్రమే స్నానానికి వెళ్లనిచ్చేవారన బాధిత బాలిక తన ఫిర్యాదులో పేర్కొంది. 
 
ఈ క్రమంలో ఈ నెల 13వతేదీన పన మనిషి సాయంతో ఆ బాలిక ఆశ్రమ నుంచి బయటపడింది. రైల్వే స్టేషన్‌కు చేరుకుని తిరుమల ఎక్స్‌ప్రెస్ ఎక్కంది. అక్కడ తనకు పరిచయమైన ఓ ప్రయాణికురాలితో తన బాధను చెప్పుకుంది. ఆ మహిళ తనతో పాటు తీసుకెళ్లి రెండు రోజుల క్రితం కృష్ణా జిల్లా కంకిపాడులోని ఓ హాస్టల్‌లో చేర్పించేందుకు ప్రయత్నిచంగా, హాస్టల్ నిర్వాహకులు మాత్రం పోలీసుల నుంచి అనుమతి లేఖ తెస్తేనే చేర్చుకుంటామని చెప్పారు. దీంతో ఆ బాలికను వెంట బెట్టుకుని బాలల సంక్షేమ కమిటీకి వెళ్ళి తనకు జరిగిన విషయాన్ని వివరించింది. 
 
దీంతో నిర్ఘాంతపోయిన కమీటీ సభ్యులు.. విజయవాడలోని దిశ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు మేరకు స్వామీజీపై పోక్సో చట్టంతో పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి సోమవారం రాత్రి అరెస్టు చేశారు. అయితే, ఆ బాలిక చేసిన ఆరోపణల్లో ఏమాత్రం నిజం లేదని అంతా అబద్ధమేనని స్వామీజీ కొట్టిపారేసారు. ఆశ్రమ భూములను కొందరు కొట్టేయాలని చూస్తున్నారని, అందులోభాగంగానే తనపై కుట్ర జరిగిందని, దీనిపై న్యాయపోరాటం చేస్తానని ప్రకటించారు. కాగా, ఆశ్రమం నుంచి బాలిక అదృశ్యమైనట్టు ఈ నెల 15వ తేదీన ఆశ్రమ నిర్వాహకులు ఫిర్యాదు చేశారు.