బుధవారం, 9 అక్టోబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 29 సెప్టెంబరు 2023 (16:27 IST)

ప్యాలెస్‌లో ఉన్న సైకో జగన్‌కి వినిపించేలా మోత మోగిద్దాం...

motha mogiddam
తమ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడుపై అక్రమ కేసు పెట్టి జైల్లో నిర్బంధించడాన్ని నిరసిస్తూ తెలుగుదేశం పార్టీ శ్రేణులు, కార్యకర్తలు వివిధ రూపాల్లో తమ నిరసనలు తెలుపుతున్నారు. ఇందులోభాగంగా, ఈ నెల 30వ తేదీ రాత్రి 7 గంటల నుంచి 7.05 గంటల వరకు ఐదు నిమిషాల పాటు మోత మోగిద్దాం అనే కార్యక్రమానికి పిలుపునిచ్చింది. ఇదే విషయంపై ఆయన ఓ ట్వీట్ చేశారు. 
 
"చంద్రబాబుకు మద్దతుగా సెప్టెంబరు 30వ తేదీన రాత్రి 7 గంటల నుంచి 7.05 గంటల వరకు ఐదు నిమిషాల పాటు 5 కోట్ల ఆంధ్రులు ఒక్కటిగా .. ఇంట్లోనో, ఆఫీస్‌లోనే ఇంకెక్కడ ఉన్నా.. బయటకొచ్చి గంట లేదా ప్లేట్ మీద గరిటెతో కొట్టండి.. లేదా విజిల్ వేయండి. రోడ్డు మీద వాహనంలో ఉంటే హారన్ కొట్టండి. మీరు ఏం చేసినా వీడియో తీసి సోషల్ మీడియాలో షేర్ చేయండి" అని పిలుపునిచ్చారు. 
 
"అక్రమ అరెస్టు చేస్తే ప్రజాగ్రహం ఎలా ఉంటుందో చూపిద్దాం. తప్పుడు కేసులు బనాయిస్తే వెనక్కి తగ్గమని నిరూపిద్దాం. నిలువెత్తు నిజాయితీ రూపం, తెలుగు తేజం చంద్రబాబుకి మద్దతుగా తెలుగు వారంతా ఉన్నారని నిరూపించే తరుణం ఇది. నిష్కళంక రాజకీయ మేరునగధీరుడు చంద్రబాబు నాయుడుకి మద్దతుగా 30వ తేదీ శనివారం రాత్రి 7 గంటల నుంచి 7.05 నిమిషాలకు ఉన్న చోటే మోత మోగించి ప్రజాస్వామ్యబద్ధంగా ప్రజాశబ్ధం వినిపిద్దాం. 
 
''నియంత ముందు మొర పెట్టుకుంటే ఫలితం ఉండదు. అధికార మత్తు వదిలేలా మోత మోగించాల్సిందే. చంద్రబాబుకు మద్దతుగా... సెప్టెంబర్ 30, రాత్రి 7 గంటల నుండి 7.05 వరకు 5 నిమిషాల పాటు ప్యాలెస్‌లో ఉన్న సైకో జగన్‌కి వినిపించేలా ఏదో ఒక రకంగా మోత మోగించండి. మీరు ఏం చేసినా దాన్ని వీడియో తీసి సోషల్ మీడియాలో షేర్ చేయండి.