మంగళవారం, 21 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. క్రైం న్యూస్
Written By జెఎస్కే
Last Updated :విజ‌య‌వాడ‌ , శనివారం, 4 డిశెంబరు 2021 (18:05 IST)

టంగుటూరులో త‌ల్లీ కూతుళ్ళ దారుణ హ‌త్య‌... ఎందుకు?

ప్రకాశం జిల్లా టంగుటూరులో తల్లీ కుమార్తె దారుణ హత్యకు గురయ్యారు. శుక్రవారం రాత్రి ఈ ఘటన చోటు చేసుకుంది. టంగుటూరులో నివాసం ఉంటున్న బంగారం వ్యాపారి జలదంకి రవికిషోర్‌ భార్య శ్రీదేవి (43), కుమార్తె వెంకట లేఖన (21)లను గుర్తు తెలియని వ్యక్తులు అత్యంత కిరాతకంగా గొంతు కోసి చంపేశారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. 

 
రవికిషోర్‌ సింగరాయకొండ రోడ్డులో ఆర్‌.కె.జ్యుయెలర్స్‌ పేరిట బంగారు దుకాణం నిర్వహిస్తున్నారు. ఆయన రాత్రి 8.20 గంటల సమయంలో ఇంటికి వెళ్లి చూసే సరికి భార్య, కుమార్తె గొంతు కోసిన స్థితిలో, తీవ్ర రక్తస్రావమై అచేతనంగా పడి ఉన్నారు. వెంటనే విషయాన్ని చుట్టుపక్కల వారికి తెలియజేశారు. వారి ద్వారా సమాచారం అందుకున్నఎస్‌.ఐ. నాయబ్‌ రసూల్‌, సింగరాయకొండ సీఐ ఎం.లక్ష్మణ్‌ సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. 

 
లేఖన ప్రస్తుతం బీటెక్‌ తృతీయ సంవత్సరం చదువుతోంది. ఈ హత్యలు చేయాల్సిన అవసరం ఎవరికి ఉందనే దానిపై పోలీసులు ఆరా తీస్తున్నారు. ఒంగోలు డీఎస్పీ యు. నాగరాజు నేతృత్వంలో క్లూస్‌ టీమ్‌ ఆధారాలు సేకరిస్తోంది. రవికిషోర్‌ భార్య, కుమార్తె హత్యకు గురి కావడంతో కుటుంబ సభ్యులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.