బక్రీద్ వేడుకల్లో వసంత కృష్ణ ప్రసాదు

ఎం| Last Updated: సోమవారం, 12 ఆగస్టు 2019 (17:19 IST)
కొండపల్లి షాబుఖారీ దర్గా, మైలవరం పట్టణంలోని ఈద్గా వద్ద ముస్లిం సోదరులు ఏర్పాటు చేసిన కార్యక్రమాల్లో మైలవరం శాసనసభ్యులు వసంత కృష్ణ ప్రసాదు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన ముస్లిం సోదరులకు బక్రీద్ శుభాకాంక్షలు తెలియజేశారు.

కొండపల్లి షాబుఖారీ దర్గాలో ప్రతేక ప్రార్ధనలు నిర్వహించిన అనంతరం నిత్యాన్నదానం కోసం ఏర్పాటు చేసిన భవనాన్ని ప్రారంభించారు. మైలవరం పట్టణంలో ఈద్గా వద్ద ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొని ప్రార్థనలు నిర్వహించారు. అనంతరం ముస్లిం సోదరులకు బక్రీద్ శుభాకాంక్షలు తెలియజేశారు.

ఈ కార్యక్రమంలో కొండపల్లి మైలవరంకు చెందిన ముస్లిం సోదరులు, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానుల పార్టీ శ్రేణులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.దీనిపై మరింత చదవండి :