సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఐవీఆర్
Last Modified: బుధవారం, 13 మార్చి 2024 (14:40 IST)

పవన్ చేసిన మోసానికి నాగబాబు ఫోన్ స్విచాఫ్ చేసుకున్నాడు: ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్

MLA Grandhi Srinivas
కర్టెసి-ట్విట్టర్
జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కల్యాణ్ పైన భీమవరం వైసిపి ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ నిప్పులు చెరిగారు. పవన్ కల్యాణ్ మానసిక స్థితి చెడిపోయిందనీ, తక్షణమే ఆయనను ఎర్రగడ్డ పిచ్చాసుపత్రిలో చేర్చాలంటూ ఆగ్రహం వ్యక్తం చేసారు. పవన్ కల్యాణ్ చేసిన మోసానికి నాగబాబు భరించలేక ఆయన తన ఫోన్ స్విచాఫ్ చేసుకున్నారంటూ ఆరోపణలు చేసారు.
 
దమ్ముంటే జగన్ మోహన్ రెడ్డిపై పులివెందులలో పోటీ చేసి గెలిచి చూపించాలని సవాల్ విసిరారు. జనసైనికుల ఆత్మగౌరవాన్ని చంద్రబాబు నాయుడు పాదాల వద్ద తాకట్టు పెట్టి 21 సీట్లకే పరిమితం చేసిన పవన్ కల్యాణ్ రాజకీయాలకు పనికిరాడు అంటూ వ్యాఖ్యానించారు. భీమవరంలో ప్రజలు పవన్ గురించి ఏమనుకుంటున్నారో ముందు తెలుసుకోవాలనీ, అదేమీ లేకుండా జనంతో వున్న తమను అంటే ప్రజలే బుద్ధి చెపుతారంటూ విమర్శించారు.