సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By జెఎస్కే
Last Modified: విజ‌య‌వాడ‌ , శనివారం, 15 జనవరి 2022 (13:51 IST)

సంక్రాంతికి పురంధేశ్వ‌రి ఇంటికి బాల‌య్య‌... గుర్రం ఎక్కి...

అఖండ అద్బుత విజ‌యంతో ఊపు మీద ఉన్న నంద‌మూరి బాల‌కృష్ణ సంక్రాంతి సంద‌డిలో మునిగితేలారు. పండుగ రోజులు సంబ‌రంగా గ‌డ‌పాల‌ని ఆయ‌న త‌న సోద‌రి బీజేపీ నేత పురంధేశ్వ‌రి ఇంటికి వ‌చ్చారు. ప్ర‌కాశం జిల్లా కారంచేడులో పురంధేశ్వ‌రి ఇంటికి స‌కుటుంబ స‌ప‌రివార స‌మేతంగా వ‌చ్చిన బాల‌కృష్ణ ఉద‌య‌మే సంప్ర‌దాయంగా చేసే గంగిరెద్దుల ప్ర‌ద‌ర్శ‌న‌తోపాటు ఈసారి వెరైటీగా గుర్రం ఆట కూడా ఆడారు. 
 
 
ప్రముఖ సినీ నటుడు, హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ గుర్రమెక్కి సందడి చేశారు. తన సోదరి దగ్గుబాటి పురందేశ్వరి నివాసంలో సంక్రాంతి వేడుకలు జరుపుకునేందుకు కుటుంబంతో సహా ప్రకాశం జిల్లా కారంచేడు వచ్చిన ఆయన చాలా సరదగా గడిపారు. గుర్రమెక్కి కాసేపు సందడి చేశారు. ఆయ‌న‌తో పాటు త‌న‌యుడు మోక్ష‌జ్ణ‌, స‌తీమ‌ణి వ‌సుంధ‌రా దేవి కూడా ఉన్నారు. ఈ సందర్భంగా బాలకృష్ణను చూసేందుకు పెద్ద సంఖ్యలో స్థానికులు తరలి వచ్చారు.