శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 19 నవంబరు 2019 (16:01 IST)

ఒక్క క్వార్టర్ బాటిల్ అమ్మకం తగ్గిందా జగన్ గారూ : నారా లోకేశ్

నవ్యాంధ్రలో సాగుతున్న మద్యం విక్రయాలపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ మరోమారు విమర్శలు సంధించారు. వైకాపా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక్క క్వార్టర్ బాటిల్ మద్యం అమ్మకం తగ్గిందా అంటూ సూటిగా ప్రశ్నించారు. 
 
ఇదే అంశంపై ఆయన మంగళవారం ట్విట్టర్ వేదికగా ప్రశ్నించారు. "మద్యపాన నిషేధం కోసం జగన్ 'మంద'డుగు వేస్తూనే ఉన్నారు. దాని ఫలితమే కాబోలు.. రాష్ట్రంలో మద్యం ఏరులై పారుతోంది. గ్రామాల్లో బెల్టు షాపులు పుట్ట గొడుగుల్లా వెలుస్తున్నాయి. 
 
జగనన్న మద్యం దుకాణాల్లో రేటు పెంచి వైకాపా మార్క్ దోపిడీని యధావిధిగా కొనసాగిస్తున్నారు. ఇంత జరుగుతున్నా షాపులు తగ్గించాం, బార్లు తగ్గించడానికి శ్రమిస్తున్నాం అంటూ ఉపన్యాసాలు ఇస్తున్న మిమ్మల్ని సూటిగా అడుగుతున్నా.. గతంలో కంటే ఒక్క క్వార్టర్ బాటిల్ అమ్మకం తగ్గిందా చెప్పండి జగన్ గారు" అంటూ నారా లోకేశ్ ట్విట్టర్‌ వేదికగా ప్రశ్నించారు.