శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By వి
Last Modified: శుక్రవారం, 17 జులై 2020 (15:40 IST)

ఏపీలో పోలీసుల తనిఖీల్లో బయటపడిన భారీ నగదు

కర్నూలు జిల్లా నంద్యాల వద్ద పోలీసులు చేపట్టిన వాహన తనిఖీలో రూ. 1.80 కోట్ల నగదు బయటపడింది. ఈ నగదును సీజ్ చేసారు పాణ్యం పోలీసులు. హైదరాబాదు నుండి కోయంబత్తూరుకు కారులో తరలిస్తున్నట్లు గుర్తించిన పోలీసులు సీజ్ చేసిన డబ్బును ఇన్‌కంటాక్స్ అధికారులకు అప్పగించారు.
 
డబ్బు తరలిస్తున్న దత్తాత్రేయ విట్టల్‌ను నగదు గురించి విచారించగా హైదరాబాదు నుండి కోయంబత్తూరుకు ఆసుపత్రికి డబ్బును తరలిస్తున్నట్లు వెల్లడించాడని పాణ్యం సీఐ గంగానాద్ బాబు చెప్పారు.