శుక్రవారం, 8 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : గురువారం, 30 జులై 2020 (16:00 IST)

కెమెరాకు చిక్కిన 'నియోవైస్' తోకచుక్క

ఆకాశంలో సందడి చేస్తున్న అత్యంత అరుదైన తోకచుక్క 'నియోవైస్‌' ఎట్టకేలకు విశాఖ వాసి కెమెరాకు చిక్కింది. మొదిలి వైష్ణవి భవ్య తోకచుక్క భూమికి అతిదగ్గరగా వెళ్తున్న అద్భుతమైన దృశ్యాన్ని భవ్య అనే మహిళ తన కెమెరాలో బందించింది.

నియోవైస్‌ తోకచుక్క పూర్తిగా దుమ్ము, ధూళితో నిండి ఉంటుంది. భూమి ఉత్తర ధ్రువ ప్రాంతంలో ఆకాశంలో కనువిందు చేస్తున్న ఈ తోకచుక్కను ఈ ఏడాది మార్చిలో నాసా తన నియోవైస్‌ ఉపగ్రహంలోని ఇన్‌ఫ్రారెడ్‌ స్పేస్‌ టెలిస్కోప్‌ ద్వారా గుర్తించింది.

ఇది అత్యంత అరుదైన తోక చుక్కని నాసా పేర్కొంది. తోకచుక్కను ఫొటో తీసేందుకు కొన్ని రోజులనుండి ప్రయత్నిస్తున్నట్లు వైష్ణవి తెలిపారు. ఈ నెల 26న శంఠ్యాం రోడ్డులోని భైరవవాక వద్ద సూర్యాస్తమయ సమయంలో ఫొటో తీసినట్లు వివరించారు.