గురువారం, 23 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By వరుణ్
Last Updated : సోమవారం, 19 డిశెంబరు 2022 (12:35 IST)

తెలుగు రాష్ట్రాలను కలుపుతూ మరో జాతీయ రహదారి.. కేంద్రం ఓకే..

national highway
దేశంలోని రెండు తెలుగు రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్, తెలంగాణలను కలుపుతూ జాతీయ రహదారి నిర్మాణానికి కేంద్రం పచ్చజెండా ఊపింది. తెలంగాణాలోని కల్వకుర్తి నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని జమ్మలమడుగు వరకు ఈ రోడ్డు నిర్మాణం చేపట్టనున్నారు. ఇందుకోసం రూ.4,706 కోట్ల నిధులను వెచ్చించనున్నారు. ఈ రహదారి నిర్మాణం కోసం వచ్చే యేడాది ఫిబ్రవరి నెలలో టెండర్లను ఆహ్వానించనున్నారు. మొత్తం 255 కిలోమీట్ల మేరకు ఈ రహదారి నిర్మాణం చేపట్టనున్నారు. 
 
ఈ జాతీయ రహదారి నిర్మాణంలో భాగంగా, ఇప్పటికే పెన్నానదిపై వంతెన నిర్మాణానికి నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా టెండర్ల ప్రక్రియను చేపట్టింది. ఇపుడు నాలుగు లేన్ల రహదారి నిర్మాణాన్ని చేపట్టనుంది. ఈ జాతీయ రహదారిని తెలంగాణాలో 91 కిలోమీటర్లు, ఏపీలో 164 కిలోమీటర్ల మేరకు నిర్మించనున్నారు. మొత్తం ప్యాకేజీల కింద ఈ రోడ్డు నిర్మాణం చేపడుతారు. 2023 ఫిబ్రవరి తొలి వారంలో టెండర్ల ప్రక్రియను చేపట్టి యేడాదిన్నర కాలంలోనే పూర్తి చేయాలని కేంద్ర భావిస్తుంది.