ఆదివారం, 12 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By
Last Updated : ఆదివారం, 4 ఆగస్టు 2019 (12:10 IST)

జమ్మూకాశ్మీర్‌లో ఎన్‌కౌంటర్.. ఉగ్రవాది హతం

జమ్మూకాశ్మీర్ రాష్ట్రంలో ఆదివారం ఉదయం ఎన్‌కౌంటర్ జరిగింది. ఈ ఎన్‌కౌంటర్‌లో ఓ ఉగ్రవాది హతమయ్యాడు. కాశ్మీర్‌లో భారత భద్రతా బలగాలకు ఉగ్రవాదులకు మధ్య ఆదివారం ఉదయం భీకర కాల్పులు జరిగాయి. ఈ సందర్భంగా ఓ ఉగ్రవాదిని భద్రతా బలగాలు ఎన్‌కౌంటర్ చేశాయి.  
 
సోపోర్ జిల్లా మల్మన్ పొర ఏరియాలో ఉగ్రవాదులు ఉన్నారన్న సమాచారంతో ఆర్మీ గాలింపు చేపట్టింది. కార్డన్ సెర్చ్ చేపట్టడంతో టెర్రరిస్టులు ఫైరింగ్ చేశారు. దీంతో భద్రతా దళాలు కూడా ఎదురుకాల్పులు చేశాయి. చాలా సేపు ఎన్‌కౌంటర్ కొనసాగింది. 
 
ఈ ఘటనలో ఓ టెర్రరిస్టును హతమార్చింది ఆర్మీ. మరోవైపు ఓ జవానుకు తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే ఆస్పత్రికి తరలించారు. శనివారం సాయంత్రం షోపియాన్‌లో జరిగిన ఎన్‌కౌటర్‌లో ఇద్దరు జవాన్లకు గాయాలయ్యాయి. ప్రస్తుతం ఉగ్రవాదులు ఇంకా అక్కడే ఉండడంతో గాలింపు జరుగుతోంది.