సోమవారం, 6 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By వరుణ్
Last Updated : ఆదివారం, 13 నవంబరు 2022 (16:40 IST)

జనసేనకు ఒక్క అవకాశం ఇవ్వండి.. మార్పు ఏంటో చూపిస్తాం : పవన్ కళ్యాణ్

pawankalyan
జనసేన పార్టీకి ఒకే ఒక్క అవకాశం ఇవ్వాలని, తద్వారా రాష్ట్రంలో మార్పు అంటే ఏంటో చూపిస్తామని జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ రాష్ట్ర ప్రజానీకానికి విజ్ఞప్తి చేశారు.
 
ఆయన ఆదివారం విజయనగరం జిల్లా గుంకలాంలో నిర్మాణంలో ఉన్న జగనన్న కాలనీని సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తూ, జనసేన పార్టీకి ఒక్క అవకాశం ఇవ్వాలంటూ కోరారు. మెరుగైన భవిష్యత్ కోసం జనసేనపై నమ్మకం ఉంచాలని, మార్పు అంటే ఏంటో చూపిస్తామని స్పష్టం చేశారు. 
 
తనపై నమ్మకం ఉంచితే గూండాలతో అయినా పోరాడుతానని పవన్ ఉద్ఘాటించారు. ఉత్తరాంధ్ర జనసైనికులు కేసులకు భయపడొద్దని, కేసులో పెడితే తాను కూడా వస్తానని హామీ ఇచ్చారు. రాజధాని పేరిట వైకాపా ప్రభుత్వం చేస్తున్న వంచనను ఉత్తరాంధ్ర ప్రజలు ఇకనైనా తెలుసుకోవాలని, ఉత్తరాంధ్ర ప్రజానీకానికి బలమైన రాజకీయం దక్కాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. 
 
అవినీతిపై రాజకీయ పోరాటం చేద్దామని ఆయన పిలుపునిచ్చారు. యువతీయువకులు తమ శక్తిని అవినీతి రహిత సమాజంగా ఏర్పాటుకోసం ఉపయోగించాలని అన్నారు. అంతకుముందు ఆయన జగనన్న కాలనీ రాష్ట్రంలోన అతి పెద్ద కాలనీ. 397 ఎకరాల్లో ఇళ్ల నిర్మాణం చేపడుతున్నాుర. అయితే, ఇక్కడ ఇళ్ల నిర్మాణం సరిగా సాగడం లేదని జనసేన ఆరోపిస్తుంది.